‘అర్జున్‌రెడ్డి’కి అడ్డంగా దొరికేసిన అనసూయ

బుల్లితెర బ్యూటీ అనసూయ, ‘అర్జున్‌రెడ్డి’కి అడ్డంగా దొరికేసింది. ‘అర్జున్‌రెడ్డి’ జస్ట్‌ సినిమా మాత్రమే కాదు.. ఆ సినిమా పేరుతో బీభత్సమైన ‘గ్రూప్‌’ నడుస్తోంది. ఆ స్థాయిలో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా ఆ ‘గ్రూప్‌’ మీద ప్రభావం చూపిందన్నది నిర్వివాదాంశం. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా ఓ ఫంక్షన్‌లో ‘సెన్సార్‌ బోర్డ్‌’ని ఉద్దేశించి సినిమాలోని డైలాగ్‌ ‘ఏం మాట్లాడుతున్నావ్‌ రా..’ అంటూ హీరో విజయ్‌ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం.

‘అందులో బూతు వుంది..’ అంటూ బుల్లితెర బ్యూటీ అనసూయ వ్యాఖ్యానించడం, అప్పటినుంచి ‘అర్జున్‌రెడ్డి’ అభిమానులు, అనసూయని ట్రాలింగ్‌ చేస్తూ వస్తుండడం తెల్సిన విషయాలే. తాజాగా, జబర్‌దస్త్‌ కామెడీ షోలో, హైపర్‌ ఆది స్కిట్‌ వివాదాస్పదమయ్యింది. అందులో ‘అనాధ’కి ఆది ఇచ్చిన నిర్వచనంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై అనసూయ స్పందించి, చేతులు కాల్చుకున్నటయ్యిందిప్పుడు.

బహుళ ప్రజాదరణను పొందిన అలాంటి కార్యక్రమంపై మరో విధంగా వ్యాఖ్యలు చేయకూడదు. క్రియేటీవిటీని తొక్కేయవద్దు. ప్రతిదాన్ని భూతద్ధంలో చూస్తూ.. గుమ్మడికాయ దొంగల్లా రియాక్ట్ అవుతున్నారు. మేం ఎలాంటి కార్యక్రమాలు చేసిన మంచి కోరే చేస్తాం. ఏదైనా ఇబ్బంది ఉంటే దానిని మరో రకంగా చూడకూడదు అని ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్ గురించి స్పందించారు. ‘అతిగా ఆవేశపడే ఆడదానికి .. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానంని ఆనాథలు అంటారు’ అనే డైలాగ్‌తో అనాథల మనోభావాలను దెబ్బతీసాడని.. ఎలాంటి అండ లేని అభాగ్యులపై ఇంత నీచంగా డైలాగ్‌లు చెప్పడం ఏమిటని సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్‌లో నెటిజన్లతో మాట్లాడేటప్పుడు ఓ నెటిజన్ హాయ్‌ అనూ ఆంటీ అంటూ కామెంట్‌ చేశాడు. ఆ కామెంట్‌పై అనసూయ అతడికి ఘాటుగా బుదులిచ్చారు. ఆంటీ అంటే అదో బూతు పదంలా చేసేశారు. నేను చాలా మందిని ఆంటీ అంటూ సంబోధిస్తుంటాను. వాళ్లందరూ బూతులా ఫీల్‌ అవ్వాలా. ఇంకోసారి దీనిపై స్పందించను. కాస్త చదువుకున్నవారిలా ప్రవర్తించండి అని అనసూయ అన్నారు.

‘అది కామెడీ స్కిట్‌.. జస్ట్‌ ఫన్‌గానే చూడాలి..’ అంటూ అనసూయ చెబుతోంటే, మరి ‘అర్జున్‌ రెడ్డి’ విషయంలో ఎందుకు ‘అతి’గా స్పందించావంటూ ‘అర్జున్‌రెడ్డి’ ఫ్యాన్స్‌ అనసూయపై గుస్సా అవుతున్నారు. కొందరు అనసూయ వస్త్రధారణపైనా జుగుప్సాకరమైన కామెంట్లతో విరుచుకుపడ్తున్నారు. దాంతో, చేసేది లేక అనసూయ చేతులెత్తేయాల్సి వస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *