కాజల్ కంటే అనసూయ కుమ్ముడే కేక …

ఖైదీ నంబర్ 150 సక్సెస్ ను విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం దక్కడంపై బోలెడంత సంతోషంగా ఉన్న బ్యూటీ.. రీసెంట్ గా ఖైదీ కోసం ప్రమోషన్స్ కూడా చేసింది. ఇప్పుడు హాట్ యాంకర్ అనసూయ నిర్వహించే ఒక షోలో పాల్గొంది కాజల్.

‘ఎ డేట్ విత్ అనసూయ’ అంటూ హాటీ అనసూయ.. సెలబ్రిటీలతో ముచ్చట్లాడుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం నెక్ట్స్ ఎపిసోడ్ కోసం కాజల్ అగర్వాల్ ను పిలిచారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తానే ఇచ్చిన అనసూయ.. ‘అమ్మడుతో ఒక కుమ్ముడు షో.. ఏ డేట్ విత్ అనసూయ.. త్వరలో’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ చిన్న వీడియోతో పాటు పోస్ట్ చేసింది అనసూయ. ఈ వీడియోలో కాజల్ అగర్వాల్-అనసూయలు ఇద్దరూ కలిసి ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాటకు స్టెప్పులు వేశారు.

అందాల భామ కాజల్ కంటే హాటీ అనసూయే.. ఈ బుల్లి వీడియోలో ఎట్రాక్టివ్ గా ఉంది. స్లీవ్ లెస్ ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లో విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ యాంకర్. టాప్ హీరోయిన్ రేంజ్ లో కాజల్ అగర్వాల్ ని కూడా డామినేట్ చేసేలా రెడీ అయిపోయిందంటే.. అనసూయ ఏ రేంజ్ హాట్ నెస్ ను బుల్లి తెరపై చూపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ ఇద్దరు భామలు కలిసి ఏమేం సంగతులు చెప్పుకున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *