క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొడుతున్న రాజ్‌త‌రుణ్.. బెస్ట్ ఓపెనింగ్స్.. !

శుక్రవారం విడుదలైన అంధగాడు చిత్రం రాజ్ తరుణ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టింది.ఈ చిత్రాన్ని రాజ్ తరుణ్ హ్యాట్రిక్ విజయంగా చెబుతున్నారు.అలాగే హిట్‌పెయిర్ రాజ్‌ర‌తుణ్‌, హెబ్బా ప‌టేల్‌కు కూడా హ్యాట్రిక్ మూవీగా నిలిచింది అంద‌గాడు. సినిమా ప్రారంభం నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా విడుద‌లైన మొదటి ఆట నుండే బాక్సాఫీసు వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోంది. తొలిరోజు 3.75 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన అంధ‌గాడు రాజ్‌త‌రుణ్ కెరీర్‌లోనే హయ్య‌స్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇవి రాజ్ తరుణ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ . ఈ చిత్రంలోని మలుపులు, సస్పెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించాడు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా అంధ‌గాడు చిత్రాన్ని చూసి అందులో రాజ్‌త‌రుణ్ న‌ట‌న‌ను, సినిమాలో ట్విస్టులు ఎంతో బావున్నాయ‌ని అప్రిషియేట్ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *