రివ్యూ: ‘ఆనందో బ్రహ్మా’ మూవీ

కథ :
తల్లిదండ్రులను కోల్పోయిన.. ఎన్నారై రాము (రాజీవ్ కనకాల) వారికి జ్ఞాపకాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వారి నివసించిన ఇంటిని అమ్మకాని పెడతాడు. అయితే అప్పటికే ఆ ఇంట్లో రెండు కుటుంబాలకు చెందిన దెయ్యాలు నివసిస్తుంటాయి. ఇళ్లు కొనటానికి ముందుకు వచ్చినవారందరూ దెయ్యాల దెబ్బకు భయపడి పారిపోతారు. దీంతో ఇంట్లో దెయ్యాలున్నాయన్న నమ్మకాన్ని చెరిపేసేందుకు ఇంటిని అద్దెకివ్వాలని నిర్ణయించుకున్నాడు రాము. ఇంట్లో మూడు రోజులు ఉండి దెయ్యాలు లేవని చెప్తే కోటీ రూపాయిలు ఇస్తాననటంతో సిద్ధూ (శ్రీనివాస్ రెడ్డి) ఇంట్లో ఉండేందుకు ముందుకు వస్తాడు.

తనతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులకు తలా పది లక్షలు ఇస్తానన్న ఒప్పందతో ఇంట్లోకి తీసుకువస్తాడు. అలా దెయ్యాలు నివసించే ఇంట్లోకి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి, ఫ్లూట్ రాజు (వెన్నెల కిశోర్), బాబు (షకలక శంకర్), తులసి (తాగుబోతు రమేష్) ఎలాంటి ఇబ్బందులు పడ్డారు..? అసలు అలాంటి ఇంట్లో ఉండేందుకు వారు ఎందుకు అంగీకరించారు..? ఆ ఇంట్లో ఉంటున్న దెయ్యాలు ఎవరు..? రాము ఆ ఇంటిని ఎందుకు అమ్మాలనుకుంటున్నాడు..? అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కాన్సెప్ట్‌, క‌థ‌నం,న‌టీన‌టులు. సినిమాకు ప్రధాన ఆకర్షణ తాప్సీ. శ్రీనివాస్‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, తాగు బోతు ర‌మేష్ తమదైన శైలీలో నటించారు. ష‌క‌ల‌క శంక‌ర్ చేసిన స్పూఫ్‌లు బాగా న‌వ్వించాయి. మిగితా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దెయ్యం నేప‌థ్యంలో ఇదివ‌ర‌కు వ‌చ్చిన చిత్రాల‌కి భిన్నంగా సాగే చిత్ర‌మిది. కొన్నిసార్లు దెయ్యాలు మ‌నుషుల‌కి భ‌య‌ప‌డుతుంటాయి. దీంతో కామెడీ బాగా పండింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్  సినిమా ప్రారంభంలో సన్నివేశాలు, లాజిక్‌ లేకపోవడం. సినిమాకు తాప్సీ ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆమె భ‌య‌పెట్టింది త‌క్కువే, అలాగే న‌వ్వించిందీ లేదు.తెర‌పై బోలెడ‌న్ని పాత్ర‌లు క‌నిపిస్తాయి. అయితే ఆ స్థాయిలో మాత్రం న‌వ్వులు పండ‌లేదు. సినిమా అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది.  ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ క‌థ‌ని రాసుకొన్న విధానం, దాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన  విధానం ఆక‌ట్టుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో గతంలో వచ్చిన ఆ సినిమాలకికి  భిన్నంగా సాగే చిత్ర‌మిది. కొన్నిసార్లు దెయ్యాలు మ‌నుషుల‌కి భ‌య‌ప‌డుతుంటాయి. దాంతో కామెడీ బాగా పండింది. ఎడిటింగ్,సంగీతం బాగుంది. అనిష్ త‌రుణ్‌కుమార్ కెమెరా ప‌నిత‌నం చ‌క్క‌గా కుదిరింది. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

విడుదల తేదీ:12/08/2017
రేటింగ్ :  3|5
న‌టీన‌టులు:  తాప్సి,శ్రీనివాస్‌రెడ్డి
సంగీతం: కృష్ణ కుమార్
నిర్మాత‌లు: విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: మహి వి.రాఘ‌వ్‌

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *