డీజే మీద ముదురుతున్న వివాదం

భారీ అంచనాల మధ్య డీజే (దువ్వాడ జగన్నాథం) విడుదలైన సంగతి తెలిసిందే. డీజే పాటల్లో దొర్లిన పదాల మీద ఇప్పటికే నానా రచ్చ జరగటం తెలిసిందే. శివుడికి ఇష్టమైన నమకం.. చమకం.. పదాలను శృంగారంలో వాడటం ఏమిటన్న ఆగ్రహంతో పాటు.. ఆగ్రహం పేరుతో ఒక వర్గాన్ని అవమానించారన్న విమర్శలు పెద్ద ఎత్తున ముసురుకున్నాయి. దీనిపై దర్శకుడు సర్ది చెప్పి.. తాను సైతం బ్రాహ్మణుడినేనంటూ చెప్పుకున్నారు.

గాయత్రీ మంత్రం హిందూ మతం లో ఉండే ప్రతీ వ్యక్తీ పరమ పవిత్రంగా భావించే ఈ మంత్రాన్ని పఠించటానికి కూడా సమయాన్నీ, స్థలాన్నీ పరిగణ లోకి తీసుకుంటారు. చెప్పులు వేసుకొనీ, శరీరం అపరిశుభ్రంగా ఉన్నప్పుడూ ఈ మంత్రాన్ని పఠించటం దోషంగా భావిస్తారు. తాజాగా విడుదలైన ఈ సినిమాలో ఇప్పటికే ఒక పాటలో శివ మంత్రాక్షరాలైన నమక, చమకాలను వాడి అవమానించారనీ, వాటిని తొలగించినా అంతకన్నా దారునం అయిన అవమాణం ఈ గాయత్రీ మంత్రానికి జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ‘‘24 ముద్రలతో 24 వైబ్రేషన్స్‌తో ఉంటుంది గాయత్రి మంత్రం. అలాంటి మంత్రాన్ని హీరోతో చెప్పులేసుకుని మంత్రింపజేయించారు.

అదే చాలా పెద్ద తప్పు. మితిమీరిన తత్వం అంటే అదే. స్వయం ప్రకటిత మేధావినని డైరెక్టర్ అనుకుంటున్నాడు. నేను బ్రాహ్మణుడిని.. నాలోనే బ్రాహ్మణత్వం ఉంది. నేనేం చెప్పినా చూస్తారని ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఆయనేం చెప్పినా ప్రేక్షకులు చూస్తారనేది మితిమీరిన తెలివితేటలు.

ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం అదే. ఎవ్వరూ కూడా చెప్పులేసుకుని గాయత్రి మంత్రాన్ని జపించరు. అది జగమెరిగిన సత్యం. మరి, దర్శకుడు చెప్పినప్పుడు హీరో తెలిసే చేసుంటాడు కదా. బ్రాహ్మణులు ఎలా ఉంటారనే దానిపై మూడునెలలో..ఆరు నెలలో శిక్షణ తీసుకున్నానని హీరో చెప్పాడు కదా. అధ్యయనం చేసే చిత్రంలో నటించానని చెప్పాడు.

ముందుగా దీనిపై మేం సెన్సార్ బోర్డు వాళ్లకు ఫిర్యాదు ఇస్తాం. అసలు చెప్పులేసుకుని గాయత్రి మంత్రం జపించకూడదన్న విషయం సెన్సార్ బోర్డు వాళ్లకు మాత్రం తెలియదా..? దానిని సెన్సార్ వాళ్లు ఎలా ఒప్పుకొన్నారు? అంటే వాళ్లు కూడా చూసీ..చూడనట్టు వదిలేసినట్టే కదా. వారితో లాలూచీ పడినట్టే కదా” అన్నది వారి మాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *