సెల్ఫీ మోజుకు మరో ప్రాణం బలైంది

సెల్ఫీ పిచ్చికి మరో ప్రాణం పోయింది. బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన ప్రముఖ వర్ధమాన మోడల్ మోడలిన్‌ డేవిస్‌ (21) 100 అడుగుల ఎత్తు నుంచి సముద్రంలో పడి మరణించింది. డేవిస్ తన మిత్రులతో కలిసి సెల్ఫీలకు ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియాలోని ‘డైమండ్‌ బే రిజర్వ్‌’ పర్వతాలపైకి వెళ్లారు. సూర్యోదయ సమయంలో ఆ పర్వత ప్రాంతం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. దీంతో 100 అడుగుల ఎత్తున్న పర్వత శిఖరం ఎక్కి ఆమె సెల్ఫీ తీసుకుంటుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పక్కనున్న సముద్రంలో పడిపోయి మరణించారు. ‘బ్యూటీఫుల్‌ ఇన్‌సైడ్‌ అండ్‌ అవుట్‌సైడ్‌’ అంటూ ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు అప్పుడే ఉదయిస్తున్న లేలేత కిరణాల మసక వెలుతురులో శిఖరాగ్రం చివరన సెల్ఫీ తీసుకునేందుకు ఆమె ప్రయత్నించింది. దీంతో కాలుజారి పక్కనున్న సముద్రంలో పడిపోయింది. దీంతో హెలికాప్టర్‌ ద్వారా ఆదివారం గాలించగా ఆమె మృతదేహం దొరికింది. కాగా, ఇదే ప్రాంతంలో గతేడాది ఆగస్టులో కూడా ఓ యువతి (27) సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు జారిపడి మరణించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *