సంఘమిత్రగా అనుష్క

బాహుబలి తర్వాత అనుష్కా మరో భారీ బడ్జెట్ సినిమా లో నటించబోతున్నట్లు ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది తమిళ దర్శకుడు  సుందర్ .సి డైరెక్షన్ లో సంఘమిత్ర సినిమా రాబోతున్న విషయం తెలిసిందే..అయితే.. ఇందులో ముందుగా శ్రుతిహాసన్ ని అనుకున్న..ఆమె వేరే కారణాల వల్ల తప్పుకున్న విషయం తెలిసిందే..

సంఘమిత్ర సినిమా నుండి శ్రుతి హాసన్ తప్పుకున్న తర్వాత ఏ హీరోయిన్  ఈ సినిమా లో నటిస్తుందంటు చాలా రోజుల నుండి సినిమా ఇండ్రీస్ర్ట్యీ లో ఓ చర్చ జరుగుతుంది. .ముందుగా తమన్నా, కాజల్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పేర్లు కూడా వినిపించినా.. ఫైనల్ గా అనుష్క కే ఫిక్స్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భాగమతి సినిమాలో నటిస్తున్న అనుష్క సంఘమిత్ర గా నటించబోతుందంటు ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

బాహుబలి తరువాత అదే స్థాయిలో సౌత్ లో తెరకెక్కుతున్న  సంఘమిత్ర.  దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక కీలకమైన సంఘమిత్ర పాత్రకు శృతిహాసన్ ను ఫైనల్ చేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఘనంగా సినిమాను లాంచ్ చేశారు. అయితే లాంచింగ్ తరువాత శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తనకు డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదన్న కారణంతో సంఘమిత్ర నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపింది శృతిహాసన్. దీంతో టైటిల్ రోల్ కోసం మరో స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సౌత్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనుష్కనే సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ విషయం గురించి అనుష్క సన్నిహితులను అడిగితే ఇంకా ఎటు వంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *