మోడీ హైదరాబాద్ పర్యటన చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది…

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన ఏపీ సీఎం చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది. మోడీ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే కేసీఆర్ భుజంపై చేయివేసి పక్కకు తీసుకెళ్లి మాట్లాడడంతోనే చంద్రబాబు చాలా ఫీలయ్యారట. తాను ఎంత చెప్తే అంత అన్నట్లుగా నడుచుకునే మోడీ అలా తన పోటీదారు కేసీఆర్ ను అక్కున చేర్చుకోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారట. మిత్రపక్ష సీఎం అయిన తనను కూడా ఎన్నడూ అంతగా కాన్ఫిడెన్సులోకి తీసుకోకుండా కేసీఆర్ కు అంత ప్రయారిటీ ఇవ్వడమేమిటని చంద్రబాబు రగిలిపోతున్నారట.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చి  ఇరవై నాలుగ్గంటలే ఉన్నారు.  శుక్రవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగగానే ఆయన  ముఖ్యమంత్రి కేసీఆర్ తో నేరుగా  10 నిమిషాల పాటు ఆంతరంగికంగా మాట్లాడారు. ఆ పరిణామమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తగా శనివారం మోడీ తిరుగు ప్రయాణంలో మరోసారి అదే సీను రిపీటైంది. శనివారం సాయంత్రం మోడీ తన అధికారి క పర్యటన ముగించుకుని ఢిల్లి వెళ్లేందుకు  శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వెళ్లి… అక్కడ వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన కేసీఆర్ తో మరోసారి అంతే ఆంతరంగికంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన చిత్రాలు మీడియాలోనూ వచ్చాయి. ఏదో ముఖ్యమైన అంశంపై కేసీఆర్ చెబుతుంటే మోడీ వింటున్నట్లుగా… అప్పటికే ఇద్దరూ ఒకరి చేతిలో ఇంకొకరు చేయేసి మాట్లాడుకుంటున్న చిత్రాలు మీడియాలో వచ్చాయి.

ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్య మంత్రితో.. అందులోనూ తన పార్టీకి చెందని ఒక సీఎంతో ఇంత విశ్వాసపాత్రంగా వ్యవహరించడం అరుదైన సన్నివేశంగా చెప్పుకోవాలి. జాతీయ స్ధాయిలో ఉత్పన్నమైన సమస్యలపై చర్చించడానికి సలహాలు తీసుకోవడానికి రాజకీయాలు అడ్డురావని రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులు కానేకావని వీరిద్దరి సాన్నిహిత్యం చెబుతోంది. ఒక ప్రధానిగా మోడీ తన భేషజాన్ని వదిలి ఇలా ఒక బీజేపీయేతర ముఖ్యమంత్రిిని విశ్వాసంలోకి తీసుకోవడం ఆధునిక రాజకీయాలకు ఒక సంకేతంగా భావించాలి.  ఇదంతా బాగానే ఉన్నా మోడీ కేసీఆర్ ల ఆంతరంగిక చర్చలు చూసి చంద్రబాబు తెగ ఫీలవుతున్నారని… ఆయన బాధ ఎలా తీర్చడమో అర్థం కాలేదంటున్నారు కొందరు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *