కొత్త ఐఫోన్స్…
ఐఫోన్ ప్రియులకు శుభవార్త. మరికొద్ది రోజుల్లో కొత్త మోడల్ ఐఫోన్లు రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10నా కొత్త మోడళ్లను రిలీజ్ చేయడం ఆనవాయితీ. అలాగే ఇప్పుడు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మాక్స్, ఐఫోన్ ఎక్స్‌ఆర్‌లకు కొనసాగింపుగా ఐఫోన్ 11 సిరీస్‌లో మూడు ఫోన్లను విడుదల చేసే అవకాశముంది. మెషిన్ లెర్నింగ్ సామర్థ్యం కోసం ఐఫోన్ 11 సిరీస్‌ను ఏ14 బయోనిక్ చిప్‌తో తీసుకురానున్నట్లు టెక్ వర్గాల సమాచారం. కొత్త ఫోన్లకు ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్‌గా పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఫోన్లతో పాటు సరికొత్త యాపిల్ వాచ్ మోడల్‌ను కూడా ఆవిష్కరించే అవకాశాలున్నాయి. భారత మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు గిరాకీ ఎక్కువే. అయితే ఈ మోడళ్లు భారత మార్కెట్లోకి ఎప్పుడొస్తాయనేది సెప్టెంబరు 10నే వెల్లడించనున్నారు.