ఐఫోన్ 11 భారత్ లో..

స్మార్ట్ ఫోనే ప్రియులు సరికొత్త ఐఫోన్స్ వచ్చాయి. కాలిఫోర్నియాలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మాక్స్ లను కంపెనీ సి‌ఈ‌ఓ టిమ్ కుక్ ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోన్ల ధరలను యాపిల్ ప్రకటించింది. భారత్ లో ఐఫోన్ 11 ధర రూ. 64,900 నుంచి ప్రారంభం కానుంది. భారత్  లో సెప్టెంబర్ 27 నుండి కొత్త ఐఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు ఇతర గ్యాడ్జెట్లను కూడా యాపిల్ మంగళవారం ఆవిష్కరించింది. యాపిల్ వాచ్ సిరీస్ 5(జే‌పి‌ఎస్) ధర 40,900 నుండి వాచ్ సిరీస్ 5(జే‌పి‌ఎస్+సెల్యులార్) ధర 49,900 నుండి ప్రారంభం కానున్నాయి.

ఐఫోన్ 11 ఫీచర్లు:

6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 3డీ టచ్ ఫార్మాట్
ఏ13 ప్రాసెసర్
512జీబీ స్టోరేజ్
12+12 ఎంపీ రియర్ కెమెరా
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
3110 ఎంఏహెచ్ బ్యాటరీ

 

ఐఫోన్ 11 ప్రొ ఫీచర్లు:

5.8 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే
ఏ13 ప్రాసెసర్
512జీబీ స్టోరేజ్
12+12+12 ఎంపీ రియర్‌ కెమరా
12ఎంపీసెల్పీ కెమెరా
3190 ఎంఏహెచ్ బ్యాటరీ

 

ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ ఫీచర్లు:

6.5 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే
ఏ13 ప్రాసెసర్
512జీబీ స్టోరేజ్
12+12+12 ఎంపీ రియర్‌ కెమెరా
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500ఎంఏహెచ్ బ్యాటరీ

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *