అరవింద్‌స్వామి ఎంజీఆర్‌ పాత్రలో

తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ డైరెక్షన్‌లో తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత బయోపిక్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తలైవి టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాలో కంగనారనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తోండగా..కోలీవుడ్‌ నటుడు అరవింద్‌స్వామి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే జయలలితగా కంగనారనౌత్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదలవగా..తాజాగా ఎంజీఆర్‌ ఫస్ట్‌ లుక్‌ బయటకు వచ్చింది.అరవింద్‌స్వామి ఈ పోస్టర్లను ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసుకున్నాడు. పురచ్చి తలైవార్‌, మక్కల్‌ థిలగమ్‌ ఎంజీఆర్‌ పాత్రకు సంబంధించిన నా ఫస్ట్‌ లుక్‌. ఈ పోస్టర్లను అందరూ ఇష్టపడతారని ఆశిస్తున్నానని అరవింద్‌స్వామి ట్వీట్‌ చేశాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకురానుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *