రూ. 21 లక్షల 47 వేల కోట్లతో జైట్లీ బడ్జెట్

డిజిటల్ లావాదేవీలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ. పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు జారీ చేస్తామని … సీనియర్‌ సిటిజన్ల హెల్త్‌ రికార్డు ఆథార్‌ తో అనుసందానం చేయనున్నట్లు తెలిపారు. మొత్తం రూ. 21 లక్షల 47 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

మొత్తం బ‌డ్జెట్ రూ.21ల‌క్ష‌ల 47వేల కోట్లు.
జీడీపీలో ప‌న్నుల‌శాతం త‌క్కువ‌గా ఉంది. ప్ర‌త్య‌క్ష ప‌న్నుల ద్వారా 1.74ల‌క్ష‌ల కోట్లే వ‌స్తోంది.
ర‌క్ష‌ణ రంగ కేటాయింపులు రూ.2.74ల‌క్ష‌ల కోట్లు.
ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనం. దీనికోసం కొత్త‌చ‌ట్టం.
ర‌క్ష‌ణ‌శాఖ విశ్రాంత ఉద్యోగుల‌కు వెబ్ ఆధారిత పింఛ‌న్ సేవ‌లు
20ల‌క్ష‌ల ఆధార్ ఆధారిత స్వైపింగ్ యంత్రాలు
పోస్టాఫీసు ద్వారా పాస్‌పోర్ట్ అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌.
డిజిట‌ల్ లావాదేవీల రూప‌క‌ల్ప‌న ఆధార‌త్‌తో కూడా చెల్లింపుల‌కు అవ‌కాశం
వ్య‌క్తిగ‌త వినియోగ‌దారుల‌కు, వ్యాపార‌స్థుల‌కు కొత్త‌గా మ‌రో రెండు ప‌థ‌కాలు.
డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్రాధాన్య‌త‌. సామాన్యుడికి ఎన్నో లాభాలు. బీమ్ యాప్‌తో చెల్లింపులు పెరిగాయి. కోటి 25ల‌క్ష‌ల మంది బీమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు
250 ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల ఉత్పాద‌క కేంద్రాలు. ఎల‌క్ట్రానిక్ ఉత్పాద‌క కేంద్రాల కోసం రూ.1.26 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి.
ముద్రా రుణాల కోసం రూ.2ల‌క్ష‌ల 44 వేల కోట్లు
20,000 మెగావాట్ల సౌర‌విద్యుత్ ఉత్ప‌త్తి ల‌క్ష్యం.
ఒడిశా, రాజ‌స్థాన్‌ల్లో చమురు నిల్వ‌ల కేంద్రాలు.
విదేశీ పెట్టుబ‌డుల కోసం ఎఫ్ఐపీబీ ర‌ద్దు.
భీమ్‌ యాప్‌ ను 125 లక్షలమంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్‌ఐపీబీ విధానం రద్దు
సామాన్యులకు డిజిటల్‌ లావాదేవీల వల్ల మేలు
బ్యాంకులు 10 లశ్రీల పీఓఎస్‌లను సమకూరుస్తాయి
పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు జారీ
సీనియర్‌ సిటిజన్ల హెల్త్‌ రికార్డు ఆథార్‌ తో అనుసందానం
లక్షన్నర ఆరోగ్య కేంద్రాలు వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్పు
ఎలక్ట్రానిక్‌ తయారీ రంగంలో రూ.లక్ష 67వేలకోట్ల పెట్టుబడులతో 250 ప్రతిపాదనలు
మౌలిక రంగానికి రూ.3 లక్షల 96 వేలకోట్లు కేటాయింపు
ఆర్థిక రంగంలో సంస్కరణల అజెండా కొనసాగుతుంది
కొత్తగా ఎఫ్‌డీఐ పాలసీ సవరింపు
టెలికం ఫైబర్‌ యాక్టీవిటీ కనెక్టివిటీ కోసం రూ.5వేలకోట్లు
2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని అరికడతాం.
ఉపాధి హామీ పథకానికి రూ. 48 వేల కోట్లు కేటాయింపు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర ఉపాధి హామీ కోసం చర్యలు తీసుకుంటాం. వ్యవసాయం కోసం ఉపాధి హామీ పథకం నిధులు వినియోగిస్తాం.
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1,87,23 కోట్లు ఖర్చుచేస్తాం.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజనకు రూ.19,100కోట్లు
ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.23వేల కోట్లు
గ్రామజ్యోతి యోజనకు రూ.4,300కోట్లు
అంత్యోదయ యోజనకు రూ.2,500కోట్లు
నిరుపేదలకు కోటి ఇళ్ల నిర్మాణం
ఫ్లోరైడ్‌ పీడిత 28వేల గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకాలు
మహిళా సాధికారత కోసం రూ.500కోట్ల మహిళా శక్తి కేంద్రాలు
గర్భిణుల ఆస్పత్రి ఖర్చులకు రూ.వేల నగదు బదిలీ
గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా
గృహ రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్‌ బ్యాంక్‌ ద్వారా రూ.20వేల కోట్ల రుణం

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *