ద్రవిడ్, అనుష్కల మధ్య ఆసక్తికర సీన్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మల మధ్య కొన్నేళ్ల కిందట ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. తొలిసారిగా ద్రవిడ్‌ను తాను కలుసుకున్న సందర్భంగా ఎదురైన ఓ అనుభవాన్ని అనుష్క స్వయంగా వెల్లడించింది. నేను అప్పటికి అంత పాపులర్ కాదు. ఆ సమయంలో ఏదో పనిమీద రాహుల్ ద్రవిడ్ బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నా సోదరుడు కర్ణేశ్ శర్మ మనం వెళ్లి ద్రవిడ్‌కు కలుద్దామన్నాడు. ద్రవిడ్ అంటే కర్ణేశ్ కు ఎంతో ఇష్టమని, ఇంకా చెప్పాలంటే అతడికి వీరాభిమాని కూడా.

క్రికెటర్ ద్రవిడ్ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ అడిగాను. ఆయన అడిగిన వెంటనే పెన్ను, బుక్ ఇచ్చాను. నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చిన వెంటనే.. ద్రవిడ్ చుట్టూ ఎంతోమంది ఆటోగ్రాఫ్ కోసం మూగారు. ఆయన ఎవరినీ నొప్పించకుండా అలాగే తన పెన్నుకు పనిపెట్టాడు. కొద్దిసేపు అక్కడే వెయిట్ చేశాను. ఇక ఓపిక నశించిపోయి.. ద్రవిడ్‌ వద్దకు వెళ్లి తన పెన్ను తిరిగి ఇచ్చేయమని అడిగేశాను. దీంతో క్రికెటర్ తో పాటు అక్కడున్నవారు షాకయ్యారు. ఆ వెంటనే తేరుకుని వారు నవ్వుకున్నారు’ అని ద్రవిడ్‌ను కలిసిన తొలి సందర్భంలో జరిగిన విషయాన్ని అనుష్క వివరించింది. స్టేట్ లెవల్ ప్లేయర్ అయిన కర్ణేశ్ ప్రస్తుతం మూవీ ప్రొడక్షన్ సంస్థకు సహవ్యవస్థాపకుడు. చెల్లి అనుష్కతో కలిసి ఆ ప్రొడక్షన్ హౌస్ లో ఎన్‌హెచ్ 10 మూవీని నిర్మించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *