ఖైదీ నెంబర్ 150 ఆడియో రిలీజ్ డేట్ కన్ఫామ్..!

మెగాఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 ఆడియో డేట్ ఫిక్సైంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరు మళ్లీ సినీ ప్రవేశం ఎప్పుడు చేస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు, ఇక పండగ మొదలైనట్టే. సినిమాలకు దూరమైన ఈ గ్యాప్ లో మెగాహీరోల ఆడియో ఫంక్షన్ కు హాజరైన చిరు, చాలా కాలం తర్వాత తన సొంత సినిమా ఆడియో ఫంక్షన్ కు రాబోతున్నారు.

డిసెంబర్ 18న మెగా 150 సినిమాకు ఆడియో ఫంక్షన్ జరగనుంది. కమ్ బ్యాక్ మూవీ కావడంతో, ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ ఈవెంట్ ను భారీ స్థాయిలో చేయాలనుకుంటున్నారు రామ్ చరణ్ అండ్ కో. పైగా, రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అన్న బ్యానర్ కు కూడా ఇదే తొలిసినిమా కాబట్టి, ఆడియో వేడుకను కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారని సమాచారం. ఇక స్టేజ్ పై మెగా యంగ్ హీరోలు చిందేస్తారని కూడా అంటున్నారు. త్వరలోనే అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. మరి ఈ మెగా ఫంక్షన్ రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుందో వేచి చూడాలి. అన్నట్టు ఈ ఆడియో లాంఛ్ కు పవన్ కళ్యాణ్, నాగార్జున, అల్లు అర్జున్ లు ఛీఫ్ గెస్టులుగా రాబోతున్నారట. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఎలాగూ ఉంటుంది. ఇక మెగాఫ్యాన్స్ అందరికీ టాప్ లేపేయడానికి మరో మంచి సందర్భం దొరికిందన్నమాట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *