యువీ ఇలా తిప్పికొట్టాడు..

న్యూఢిల్లీ:’భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ తరహా పోలికలు ఉన్నాయి. వరల్డ్ స్పోర్ట్స్ లో ట్రంప్ లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లినే. తన ముఖం మీద కోడి గుడ్డు మరకల్ని దాచి పెట్టి ట్రంప్ తరహాలో మీడియాపై ఎదురుదాడి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లినే’ అంటూ ఇటీవల ఆసీస్ మీడియా తన అక్కసును ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై భారత్ క్రికెట్ జట్టు పెద్దగా పట్టించుకోలేదు. అటు భారత మాజీ క్రికెటర్లు కూడా ఆసీస్ మీడియా తీరు అంతే అనే విధంగా వ్యవహరించారు. కాగా, మన వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ మాత్రం తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘విరాట్ ను డొనాల్డ్ ట్రంప్ తో పోల్చడం ఒక పెద్ద పొగడ్త. ఎందుకంటే ట్రంప్ అత్యుత్తమం కనుకే అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అలానే కోహ్లి కూడా బెస్ట్ అనే విషయాన్ని ఆసీస్ మీడియా పరోక్షంగా ఒప్పేసుకుంది’ అని యువరాజ్ చురకలంటించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *