అ ! – ఆశ్చర్యపోవడం ఖాయం

క‌థ‌:
ఓ రెస్టారెంట్‌లో కలి (కాజ‌ల్ అగ‌ర్వాల్‌) ఎంట్రీతో సినిమా మొద‌ల‌వుతుంది. క‌లి ఓ ఆందోళ‌న‌తో బాధ‌ప‌డుతూ ఉంటుంది. అదే రోజు ఆమె పుట్టిన‌రోజు కావ‌డం కూడా. అదే స‌మ‌యంలో అదే రెస్టారెంట్‌లో రాధ‌(ఈషారెబ్బా) త‌న త‌ల్లి (రోహిణి), తండ్రితో క‌లిసి ప్రియుడి కోసం వెయిట్ చేస్తుంటుంది. ఆమె త‌ల్లిదండ్రులు త‌మ అమ్మాయి మంచి ఆస్థిప‌రుడుని చూసి ప్రేమించింద‌ని అనుకుంటారు. కానీ తీరా కృష్ణ‌వేణి(నిత్యామీన‌న్‌)ని ప‌రిచ‌యం చేసి తాము పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటుంది. అదే హోట్‌లో చెఫ్ ఉద్యోగానికి వ‌స్తాడు నాలా (ప్రియ‌ద‌ర్శి). నిజానికి నాలాకు వంట రాదు. యూ ట్యూబ్‌లో చూసి వంట‌లు చేసేయ‌వ‌చ్చున‌ని అనుకుంటాడు. కానీ ఆ హోట‌ల్‌లో ఇంట‌ర్నెట్ ప‌నిచేయ‌దు. ఆ స‌య‌మంలో ఆ రూంలో ఓ మూల‌నున్న ఎక్వేరియంలో చేప‌(నాని వాయిస్ ఓవ‌ర్‌లో) మాట్లాడే మాట‌లు.. నాలాకు అర్థ‌మ‌వుతాయి. నాలాకు వంట‌లు చేయ‌డ‌మెలాగో చేప నేర్పిస్తుంటుంది. అదే రూమ్‌లో ఓ చెట్టు (ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్‌) కూడా వీరికి జ‌త క‌లుస్తుంది. ఆ హోటల్‌కి ఫేమ‌స్ మేజిషియ‌న్ యోగి(ముర‌ళీశ‌ర్మ‌) వ‌చ్చి..తాను గొప్ప మేజిషియ‌న్ అని గ‌ర్వంగా చెబుతాడు. కానీ రెస్టారెంట్ య‌జ‌మాని(ప్ర‌గ‌తి) కూతురు(చిన్న‌పాప‌) ఒప్పుకోదు. వీరి క‌థలు ఇలా సాగుతుండ‌గా.. అదే హోటల్‌లో ప‌నిచేసే మీరా (రెజీనా) ఓ పార్టీని మోసం చేసి డ‌బ్బులు కాజేయాల‌ని అనుకుంటూ ఉంటుంది. ఆమె డ్ర‌గ్స్‌కి బానిస‌. అదే హోట‌ల్‌లో మీరా స‌ర్వ్ చేసే టేబుల్ వ‌ద్ద కూర్చొనే ర‌ఘురామ్ ఎవ‌రితోనో మాట్లాడుతుంటాడు. మీరాకు ర‌ఘురామ్ ఎవ‌రితో మాట్లాడుతున్నాడో అర్థం కాదు. తీరా అత‌నొక ఆత్మ‌తో మాట్లాడుతున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. ఆమెకు భ‌యం వేస్తుంది. మ‌రోవైపు సైంటిస్ట్ అయిన శివ‌(అవ‌స‌రాల శ్రీనివాస్‌) టైంమిష‌న్ క‌నిపెట్టి చిన్న‌త‌నంలో తప్పిపోయిన త‌న త‌ల్లిదండ్రుల‌ను క‌లుసుకోవాల‌నుకుంటుంటాడు. మ‌రి ఇన్ని క్యారెక్ట‌ర్స్‌కు మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంటి? అస‌లు క‌లి ఆందోళ‌న‌గా ఎందుకు ఉంటుంది? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన బలం క్లైమాక్స్. అవును ఆరంభం నుండి చూపించిన అనేక పాత్రలకి, వాటి చర్యలకి, సన్నివేశాలకి, మాటలకి జస్టిఫై చేసేలా ఉన్న ఈ ముగింపు చాలా థ్రిల్లింగా ఉంటుంది. ఏమాత్రం ఊహకందని ఈ ముగింపు చూశాక సినిమా అర్థమైన ప్రేక్షకుడు ఎవరైనా దర్శకుడ్ని మెచ్చుకోకుండా ఉండడు.

మొదటి అర్థ భాగం మొత్తాన్ని పాత్రల పరిచయానికే వాడుకున్న దర్శకుడు ముఖ్యమైన నిత్యా మీనన్, ఈషా రెబ్బ, కాజల్ అగర్వాల్, రెజినా వంటి పాత్రల్ని చాలా ఆసక్తికరంగా పరిచయం చేశాడు. ముఖ్యంగా కాజల్, రెజినా పాత్రలు తీవ్రంగా, మురళీ శర్మ, ప్రియదర్శి పాత్రల్లో మంచి ఫన్ మూమెంట్స్ దొరుకుతాయి. చేప (నాని), బోన్సాయ్ చెట్టు (రవితేజ)ల మధ్యన జరిగే సంభాషణలు నవ్వించాయి.

ఇక ఇంటర్వెల్ సన్నివేశాన్ని భలేగా ఉంది అనేలా ఇచ్చి సెకండాఫ్లో ప్రేమ, కొన్ని సోషల్ ఎలిమెంట్స్, హర్రర్ వంటి జానర్లను సమపాళ్లలో మిక్స్ చేసిన దర్శకుడు మీగుంపుని మాత్రం ఊహించని రీతిలో ఇచ్చాడు. మార్క్.కె. రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరొక పెద్ద బలం. కీలకమైన ప్రతి సన్నివేశాన్ని ఎఫెక్టివ్ గా తయారుచేశారాయన.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి సగ భాగంలో పాత్రల పరిచయం బాగున్నా అసలు కథేమిటి అనేది రివీల్ కాకపోవడంతో అన్ని పాత్రలు ఎందుకనే సందేహం కలుగుతుంది. శ్రీనివాస్ అవసరాల పాత్ర మీద నడిచే కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉంటాయి. పైగా అతని ట్రాక్ కొంత కన్ఫ్యూజన్ కు గురిచేస్తుంది కూడ.

ద్వితీయార్థంలో ముంగింపుకు ముందు జరిగే కొన్ని సన్నివేశాలు కొంత కన్ఫ్యూజన్ కు గురిచేస్తాయి. కొత్తదనాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఫలితంతో సంబంధం లేకుండా ఒకడుగు ముందుకేసి నాని చేసిన ఈ సినిమా కొత్తదనాన్ని కోరుకునే వారికి నచ్చినా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కాన్సెప్ట్ ఆధారంగా తీయడంతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకి అంతగా నచ్చకపోవచ్చు.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గా ‘అ!’ ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. మార్క్ ఎ.రాబిన్ నేపథ్య సంగీతం.. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం సినిమాకు తగ్గట్లుగా చాలా బాగా కుదిరాయి. సినిమాకు బలంగా నిలిచాయి. ఆర్ట్ వర్క్.. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల విషయంలో నాని-ప్రశాంతి రాజీ పడలేదు. దర్శకుడికి పూర్తిగా సపోర్ట్ చేశారు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచనలు చాలా కొత్తగా అనిపిస్తాయి. తెలుగులో నెవర్ బిఫోర్ అనిపించే కథను.. కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటి స్క్రీన్ ప్లే ఇంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో చూసినప్పటికీ ఇది మరింత భిన్నంగా అనిపిస్తుంది. తాను ఏం చెప్పాలనుకున్నాడో అది రాజీ లేకుండా చెప్పాడతను. ప్రశాంత్ రచయితగా.. దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నాడు కానీ.. అతను సగటు ప్రేక్షకుడిని దృష్టిలో ఉంచుకుని కథాకథనాల్ని తీర్చిదిద్దుకుని ఉండాల్సిందనిపిస్తుంది.

విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2018

 రేటింగ్ : 3.25/5

నటీనటులు : కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజినా కసాండ్రా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ, దేవ దర్శిని

దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

నిర్మాత : ప్రశాంతి త్రిపురనేని

సంగీతం : మార్క్.కె. రాబిన్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *