బాహుబలి 2 ఫస్ట్ డే రికార్డ్..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెయిడ్ ప్రీమియర్స్ పేరుతో గురువారం రాత్రి నుంచి బాహుబలి కలెక్షన్ల వేట మొదలైనా.. అఫీషియల్గా శుక్రవారం ఎర్లీ మార్నింగ్ షోతో బాహుబలి హవా మొదలైంది. ఇప్పటికే బిజినెస్ ఎనలిస్ట్లు చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం మీద బాహుబలి 2 తొలి రోజే దాదాపు వంద కోట్ల వరకు వసూళ్లు సాధింస్తుందని భావించారు.

అయితే అందరికీ షాక్ ఇస్తూ తొలి 24 గంటల్లో కేవలం భారత మార్కెట్ లోనే బాహుబలి 2 ఏకంగా 125 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది. సౌత్లో వందకోట్ల వసూళ్లు ఫుల్ రన్లో సాధించటమే కష్టంగా ఉన్న రోజుల్లో.. తొలి రోజే 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి ఆల్ టైం రికార్డ్ను సెట్ చేసింది. ఇప్పటికే బాలీవుడ్ రికార్డ్ లను కూడా బద్దలు కొట్టడం ప్రారంభించిన ఈ భారీ చిత్రం, ఫుల్ రన్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేయటం కాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్లు, హిందీలో 38 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు, కేరళలో 9 కోట్లు, తమిళనాట 11 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు ఓవర్ సీస్ కలెక్షన్లు కూడా కలుపుకుంటే తొలి రోజే 150 కోట్ల మార్క్ కు బాహుబలి 2 చేరువైనట్టే. అయితే అనధికారిక సమాచారం ప్రకారం కలెక్షన్లు 180 కోట్ల వరకు ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *