ట్రైలర్ టాక్: అంతకు మించేలా బాహుబలి 2

సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి ట్రైలర్‌ వచ్చేసింది. మొత్తం 1 నిమిషం 52 సెకన్ల నిడివి ఉన్న బాహుబలి-2 ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వచ్చింది. సోషల్‌ మీడియాలో ఉన్న అంచనాలను నిజం చేస్తూ మైండ్‌ బ్లోయింగ్‌ వీఎఫ్‌ఎక్స్‌తో ట్రైలర్‌ రూపుదిద్దుకుంది.

రమ్యకృష్ణ కాలిని ఎవరో తాకుతున్నట్లు మొదలైన ట్రైలర్‌.. బాహుబలిని కట్టప్ప పొడిచి చంపడం.. లాంటి ఉత్కంఠ భరిత సీన్లతో ముందుకు సాగింది. అయితే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను పొడిగిస్తూ.. ప్రశ్నార్ధకంగానే ఉంచేశారు. బాహుబలి2 తెలుగు ట్రైలర్‌ గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విడుదల కానుంది. దాని కంటే ముందు గురువారం ఉదయం 300 థియేటర్లలో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేస్తారు.

ప్రభాస్‌, రానాలు ఈ సినిమాలో హీరో, విలన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అనుష్క, తమన్నాలు హీరోయిన్లు. ఆర్కా మీడియా వర్క్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్‌, రమ్యకృష్ణ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *