చిరు మైండ్లో శాతకర్ణి.. బాలయ్య కారులో ఖైదీ

సంక్రాంతికి సినిమా ఫెస్టివల్ ఏ రేంజులో ఉండబోతోందో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే తరహా ఫెస్టివల్ అటు మెగా క్యాంపులో ఇటు నందమూరి హబ్ లో కూడా మొదలైపోయిందని తెలుస్తోంది. ముఖ్యంగా లీడింగ్ హీరోలిద్దరూ కూడా తమ స్నేహితుడి సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారట. ఫిలిం నగర్ లో ఇప్పుడు వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన కథనం విందాం పదండి.

మొన్ననే చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాకు సంబంధించిన నీరు నీరు నీరు సాంగ్ విడుదలైంది. పాట రిలీజైన మరుక్షణం నుండే ఎమోషనల్ గా ప్రేక్షకులను మ్యూజిక్ లవ్వర్లను కట్టిపాడేయటం మొదలెట్టేసింది. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో ఉన్న మాస్ పాటలన్నీ ఒకెత్తయితే.. హృదయాన్ని రంజింపజేస్తున్న ఈ పాథోస్ సాంగ్ మరో ఎత్తు. అందుకే తన కారులో ఈ పాటను నందమూరి బాలకృష్ణ ఓ రెండుసార్లు ప్రత్యేకంగా విన్నారని టాక్ వినిపిస్తోంది. పైగా ఆయన కూడా తదుపరి రైతు సమస్యలపై సినిమా తీయనున్నారు కాబట్టి.. ఈ పాటను ఒకసారి ఆలకించాలని ఆయనకు సన్నిహితులు సూచించారట. ఈ పాట ఆయనకు విపరీతంగా నచ్చేసిందని టాక్.

ఇకపోతే సినిమాలపరంగా ఎంత రైవల్స్ అయినా కూడా రియల్ లైఫ్ లో చిరంజీవి అండ్ బాలయ్య మాంచి స్నేహితులు. అందుకే చిరంజీవి 60వ బర్తడే పార్టీలో బాలయ్య అదిరిపోయే రచ్చ చేస్తే.. 100వ సినిమా శాతకర్ణి ముహూర్తం ఈవెంటుకు చిరంజీవిని చీఫ్ గెస్టుగా పిలిచారు నందమూరి హీరో. అప్పుడే సిఎం కెసిఆర్ ఈ సినిమాను చిరంజీవితో కలసి చూస్తానని చెప్పారు కూడా. ఇక ఎలాగో తన ఖైదీ సినిమాను ఆల్రెడీ నాలుగైదుసార్లు చూసుకుని హ్యాపీ ఫీలైన చిరంజీవి.. బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను ఎప్పుడు చూపిస్తాడు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

ఆల్రెడీ ఇటు చిరంజీవి అటు బాలయ్యలు కూడా తమ సినిమా ప్రత్యేక స్ర్కీనింగ్ వెయ్యాలని ప్లానింగ్ చేస్తున్నారు. కేవలం హై ప్రొఫైల్ సెలబ్రిటీలు.. ఫ్యామిలీ మెంబర్లను మాత్రం ఈ స్ర్కీనింగ్ కు ఇన్వయిట్ చేస్తారట. అది సంగతి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *