తెలంగాణ అసెంబ్లీకి బాలకృష్ణ: సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

హైదరాబాద్: ప్రముఖ నటుడు, హిందూపురం తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీకి రానున్నారు. తాను నటించిన గౌతమీపుత్ర శాతకర్ణ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయించిన నేపథ్యంలో బాలకృష్ణ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలవనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలుపనున్నారు. సంక్రాంతి సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా, శ్రియా, హేమామాలిని ప్రధాన పాత్రలను పోషించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *