వెదురుబొంగు బాటిళ్లు, వీటిలో పోసిన నీళ్లు చల్లగా…..

  ఎండాకాలం లో ప్లాస్టిక్‌ బాటిల్స్‌ నీరు వీడిగావుంటాయి. ప్లాస్టిక్‌కు వీడ్కోలు పలికి ప్రకృతివైపు వెళ్లడానికి ఎక్కువ మందిని ప్రభావితం చేసిన వ్యక్తి దృతిమాన్‌ బోరా. అస్సాంలో వెదురు వస్తువుల తయారీ సంస్థ వ్యవస్థాపకుడు. వెదురు నుండి పర్యావరణ అనుకూల వస్తువులను తయారుచేస్తున్న బోరా ఈ బయోడిగ్రేడబుల్‌ బాటిళ్లను నీళ్లు బయటకు రానివిధంగా తయారు చేశాడు. సీసా మూత కార్క్‌ అంటే వెదరుముక్కతో తయారుచేసి బిరడాలా బిగించడంతో ఇది నీళ్లను బయటకు రానివ్వదు. ఈ వెదురుబొంగు బాటిళ్లను పరిచయం చేయడానికి ధృతిమాన్‌కి 17 ఏళ్ళకు పైగానే పట్టింది. సుమారు 20 ఏళ్ల క్రితం ధృతిమాన్‌ బోరా పన్నెండవ తరగతితో చదువును ఆపేస్తానని తల్లిదండ్రికి ధైర్యంగా చెప్పేశాడు. జీవితంలో ఎలా నిలదొక్కుకుంటాడో అని భయపడిన తల్లి దండ్రులకు పై చదువులకు బదులుగా వెదురుతో రకరకాల ఫర్నీచర్‌ను తయారుచేసే వ్యాపారాన్ని ప్రారంభించి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు.  

. కొనుగోలుదారులను తన ఉత్పత్తులవైపు ఆకర్షించడానికి ఏదైనా ప్రత్యేకమైన వస్తువును కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. రకరకాల పనులు చేస్తూనే వెదురు నీటిబాటిల్‌ తయారీలో నిమగ్నమయ్యేవాడు. ఇప్పుడు ఏడాదిలోగా ఒక్క అస్సాంలోనే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వెదురు బాటిళ్లలో నీళ్లు తాగాలనుకునేవిధంగా ఇవి ఆకర్షించాయి. ఈ బాటిళ్లు వేర్వేరు పరిమాణాలలో రూ.400 నుంచి రూ.600 మధ్య లభిస్తున్నాయి.  ‘సహజమైన ఉత్పత్తి కావడంతో ఈ బాటిళ్లలో పోసిన నీళ్లు చల్లగా, శుభ్రంగా ఉంటాయి. ఇది గట్టిగా ఉండటంతో సులువుగా పగిలిపోదు. బొంగు కాబట్టి తేలికగానూ ఉంటుంది. దీనిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు’ అని చెబుతాడు బోరా. ‘మా సెంటర్లో పతి నెలా 1500 వరకు వెదురు బాటిళ్లను ఉత్పత్తిచేస్తాం. డిమాండ్‌కు తగ్గట్టు మిషనరీ తెప్పించుకోవడం, తయారు చేసిన సరుకును మార్కెట్‌కు చేర్చడం ఒక సవాల్‌..’ అంటాడు బోరా. . ప్లాస్టిక్‌ బాటిల్స్‌కు ప్రత్యామ్నాయం గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందువల్ల వారు ఎదుర్కొంటున్న అవరోధాలను అధిగమిస్తూ ఈ బాంబూ బాటిల్స్‌ ద్వారా ఒక అవగాహన కల్పించవచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *