కొత్త ఇంటి కోసం బ్యాంక్ లోన్స్

కొత్త ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా? లేదంటే కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? దీని కోసం బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ రకాల హోమ్ లోన్స్ అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద రుణాలు ఆఫర్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ (అర్బన్) కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలు లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా లోన్ కోసం అప్లై చేసుకున్న వారు సబ్సిడీ పొందొచ్చు. ఇంటి నిర్మాణం, కొనుగోలు కోసం రుణం తీసుకోవచ్చు. క్రేడిట్ లింక్డ్ సబ్సిడీ ద్వారా ఆఫర్డబుల్ హౌసింగ్ కార్యక్రమంలో నాలుగు కేటగిరిలు ఉన్నాయి.

మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఆఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్‌లో మొత్తంగా 4 కేటగిరిలు ఉంటాయి. సీఎల్ఎస్ఎస్ – ఈడబ్ల్యూఎస్/ ఎల్ఐజీ, రివైజ్డ్ సీఎల్ఎస్ఎస్- ఈడబ్ల్యూఎస్/ ఎల్‌ఐజీ, సీఎల్ఎస్ఎస్ (ఎంఐజీ 1), సీఎల్ఎస్ఎస్ (ఎంఐజీ 2) అనేవి ఇవి. ఇక్కడ ఎల్ఐజీ అంటే తక్కువ ఆదాయం ఉన్న గ్రూప్‌లు (రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు), ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (రూ.3 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారు) అని అర్థం వస్తుంది. ఆఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ వచ్చే ఏడాది మార్చి చివరి వరకు అందుబాటులో ఉంటుంది. తొలిసారి ఇల్లు కట్టుకుంటున్న వారికి లేదా ఇల్లు కొనుగోలు చేస్తున్న వారికే ఇది వర్తిస్తుంది. కేంద్రం హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీ మొత్తంలో సబ్సిడీ అందిస్తుంది. ఆఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ వచ్చే ఏడాది మార్చి చివరి వరకు అందుబాటులో ఉంటుంది. తొలిసారి ఇల్లు కట్టుకుంటున్న వారికి లేదా ఇల్లు కొనుగోలు చేస్తున్న వారికే ఇది వర్తిస్తుంది. కేంద్రం హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీ మొత్తంలో సబ్సిడీ అందిస్తుంది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ఈడబ్ల్యూఎస్/ఎల్ఐజీ కేటగిరి కింద హోమ్ లోన్ తీసుకుంటే గరిష్టంగా రూ.2.2 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు. అదే రివైజ్డ్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్- ఈడబ్ల్యూఎస్/ ఎల్ఐజీ కింద లోన్ తీసుకుంటే గరిష్టంగా రూ.2.67 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ఎంఐజీ కేటగిరి కింద హోమ్ లోన్ తీసుకుంటే గరిష్టంగా రూ.2.35 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. అదే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ఎంఐజీ 2 కేటగిరి కింద లోన్ తీసుకుంటే రూ.2.3 లక్షల సబ్సిడీ లభిస్తుంది. రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎంఐజీ 1 కిందకు, రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు ఎంఐజీ 2 కిందకు వస్తారు. ఆఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద లోన్ సులభంగానే పొందొచ్చు. ఎస్‌బీఐ కూడా ఈ తరహా రుణాలు అందిస్తోంది. దీని కోసం ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. https://onlineapply.sbi.co.in/personal-banking/home-loan-callback?se=SocialMedia&cp=Instagram&Ag=CallBack ఈ లింక్ సాయంతో మీరు లోన్    కోసం దరఖాస్తు చేసుకోండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *