బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్ బ్రయింట్ మృతి చెందారు

బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్ బ్రయింట్ (41) ఇక లేరు.. హెలికాప్టర్ ప్రమాదంలో అయన మృతి చెందారు. అనుకోకుండా హెలికాప్టర్ కొండను ఢీ కొట్టడంతో అయనతో పాటు అయన కూతురుతో సహా మరో 13 మంది మృతి చెందారు. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించింది. కానీ అప్పటికే వారు మృతి చెందారు.కోబ్ మరణ వార్త తనని దిగ్భ్రాంతకి గురిచేసిందని టీమిండియా కెప్టెన్ కోహ్లీ అన్నారు. బాస్కెట్ బాల్ కోర్టులో జేమ్స్ ఆట చూసి మైమరచిపోయేవాడిని. అతనితోపాటు అతని కూతురు ప్రమాదంతో మరణించారని తెలిసి హృదయం ముక్కలైంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు్న్నా అని కోహ్లీ అన్నారు. టీమిండియా జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. క్రీడా రంగానికి విచారకరమైన రోజు. కోబ్ అతడి కుమార్తె ప్రమాదంలో మరణించన ఇతరులు కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నా అని రోహిత్ తెలిపారు. కోబ్ బ్రయింట్ మరణం పట్ల ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హీరో వెంకటేష్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు..1996లో బాస్కెట్‌‌బాల్ కెరీర్‌ని ప్రారంభించిన బ్రయింట్‌ 2016లో బాస్కెట్‌‌బాల్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కోబ్ బ్రయింట్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. తన కెరీర్లో ఐదు సార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచి దాదాపుగా రెండు దశాబ్దాల పాటు బాస్కెట్‌బాల్‌‌‌లో తిరుగులేని ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ‘డియర్ బాస్కెట్‌బాల్’ పేరుతో అతను రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌కి ఆస్కార్ కూడా వచ్చింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *