విండీస్ పర్యటనకు జట్టు ప్రకటన

ప్రపంచ కప్ తర్వత భారత్ అడుతున్న వెస్టిండీస్ సిరీస్ కు జట్టు ఎంపిక చేసింది జాతీయ సెలక్టర్ల బృందం.  ఒకేసారి మూడు ఫార్మాట్లలో టి20లు, వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు జట్లను ప్రకటించింది. చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో ఆదివారం సమావేశమైన సెలక్టర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు 15 మంది చొప్పున, టెస్టులకు 16 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. ఎంపిక చేసిన జట్లలో ఊహించినట్లే సెలెక్టర్లు ఎక్కువ మంది కుర్రాళ్లకు చోటు కల్పించారు. మిడిలార్డర్‌ను పటిష్టం చేయడంతో పాటు.. యువ పేసర్లను పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు జరిగే కరీబియన్‌ పర్యటనలో భారత్‌ 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది.  BCCI-India-825x510-644x362

ఈ పర్యటనలో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌ కోహ్లినే. వన్డే, టీ20 జట్లలో దిల్లీ పేసర్‌ నవ్‌దీప్‌ సైని, రాజస్థాన్‌ లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌లే కొత్త ముఖాలు. టీ20 జట్టులో రాహుల్‌ సోదరుడు దీపక్‌కు కూడా చోటు దక్కడం మరో విశేషం. శ్రేయస్‌, మనీష్‌, ఖలీల్‌ అహ్మద్‌ తిరిగి వన్డే జట్టులోకి రాగా, దినేశ్‌ కార్తీక్‌పై వేటు పడింది. ధావన్‌ తిరిగి జట్టులో చోటు దక్కించుకోగా, గాయంతో బాధపడుతున్న విజయ్‌శంకర్‌, పృథ్వీషాలను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. మూడు ఫార్మాట్లలోనూ కీలకమైన పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను మొత్తం విండీస్‌ టూర్‌కే ఎంపిక చేయలేదు.

టెస్టు జట్టులో వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పునరాగమనం. అయితే అతను రిషబ్‌ పంత్‌కు బ్యాక్‌ అప్‌ కీపర్‌గా ఉంటాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా తిరిగి జట్టులోకొచ్చాడు. వన్డే, టీ20 జట్టులో లేని బుమ్రా టెస్టుల్లో ఆడనున్నాడు. ఓపెనర్‌ మురళీ విజయ్‌ జట్టులో చోటు కోల్పోగా.. హనుమ విహారి, చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

టి 20 జట్టు:

కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌, మనీష్‌ పాండే,రిషభ్ పంత్‌(వికేట్ కీపర్), కృనాల్‌, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైని.

టెస్టు జట్టు:

మయాంక్‌ అగర్వాల్, రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, హనుమ విహారి, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్(వికేట్ కీపర్), సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్‌ శర్మ, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌.

 

వన్డే జట్టు:

కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే,రిషభ్ పంత్‌(వికేట్ కీపర్), జడేజా, కుల్‌దీప్‌, చాహల్‌, జాదవ్‌, షమి, భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవ్‌దీప్‌ సైని.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *