రోగాల్ని నయం చేసే తేనె

తేనెటీగలు పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. రుచితోపాటు 100రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది.

విటమిన్ సితో పాటు రకరకాల ప్రొటీన్లు ఇందులో నిక్షిత్త్పమై ఉంటాయి. దీంతో పలు రకాల అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందొచ్చు. జీర్ణ కోశ సమస్యలతో బాధపడేవారు తేనెతో చేసిన పిండిపదార్ధాలను తినడం ద్వారా తక్షణమే తగ్గిపోయే అవకాశం ఉంది. వీటితో పాటు నోటీ దుర్వాసన ,గజ్జి, కొలస్ట్రాల్ ను తగ్గించడం చేస్తుంది.

ఈ విధంగా రోజుకు మూడు పూటలా తింటే క్యాన్సర్ దరికిరాదు. సూక్ష్మజీవుల సంహారిణి. బాక్టీరియా, ఈస్ట్ వంటి సూక్ష్మజీవులను ఎదగనివ్వదు. తేనెలోని కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని అందిస్తాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *