ఆంధ్రజ్యోతికి భారీ షాక్.. బ్యూరో చీఫ్ రాజీనామా

సిటీ బ్యూరో మొత్తాన్ని ఒంటి చేతిమీద నడిపిస్తూ, ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంలో బ్రహ్మాండమైన కవరేజిని ఇవ్వడమే కాకుండా.. యాడ్స్ విషయంలో కూడా సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెట్టిన ఆంధ్రజ్యోతి సిటీబ్యూరో చీఫ్ చంద్రశేఖర శర్మ రాజీనామా చేశారు.

యాజమాన్యం ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయం.. ఆ సందర్భంలో తన పట్ల వ్యవహరించిన తీరుతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన తప్పుకోవాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి యాడ్స్‌కు ఆస్కారం లేని డ్రై పీరియడ్‌లో కూడా వాటర్ డే అనే పేరుతోనో, మరో డే పేరుతోనో మెయిన్ పేజీలో ఫుల్ పేజి, హాఫ్ పేజి ప్రకటనలు తీసుకురాగల సామర్థ్యం ఆయన సొంతం.

మెట్రో రైలు, జీహెచ్ఎంసీ, పీసీబీ.. ఇలా అన్ని విభాగాలకు సంబంధించి జ్యోతిలో వచ్చే సంచలన కథనాలు చాలావరకు ఆయన కలం నుంచి వచ్చినవే. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం పత్రికకు పెద్ద లాసే

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *