వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

మనకు భానుడు చూపించే ఉష్ణంలో వడదెబ్బకు గురికాక తప్పడంలేదు. కానీ మనం మన జాగ్రత్తలో ఉంటే భానుడి ప్రతాపానికి గురికాకుండా ఉండొచ్చు. ఏప్రిల్, మే నెలలు వచ్చాయంటే చాలు.. వామ్మో ఎండలు.. అంటుంటారు. ఈ వేసవిలో 40 రోజుల పాటు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ సైతం హెచ్ఛరించిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు.

వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
* ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయంలో ఎండలో పనిచేయరాదు
* తప్పనిసరిగా పని చేయాల్సి వస్తే ఎండ తీవ్రత పెరగక ముందే అంటే ఉదయం 11 గంటలలోపే పనులు పూర్తిచేసుకోవాలి
* పనిచేస్తున్న సమయంలో శరీరంమంతా కప్పి ఉండేలా వదులుగా ఉండే తెల్లటి కాటన్ దుస్తులను ధరించాలి
* అదేవిధంగా వేసవిలో తరచూ ఓఆర్‌ఎస్, నిమ్మరసం, పలుచని మజ్జిగ వంటి ద్రావణములు తీసుకోవడం శ్రేయస్కరం
* ఎండకాలంలో ఎక్కువగా పుచ్చకాయ, కొబ్బరిబోండాలు, కర్బూజా, నీరు అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం మంచిది.
* ఎండలో నడుస్తున్నడు, పనిచేసేటప్పుడు ఎండ తగలకుండా గొడుగులు ఉపయోగించాలి
* బైక్‌పై ప్రయాణించేటప్పుడు ఎండ తగలకుండా తలకు టోపీగానీ, డాక్టర్ సూచించే నల్లటి కళ్లద్దాలుగానీ ధరించాలిత
* ప్రయాణాలు చేయాల్సి వస్తే ఉదయం పూటగానీ లేదా సాయంత్రంగానీ చేయాలి
* కాఫీ, టీ, నూనె పదార్థాలు, ఆల్కాహాల్, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది
* ఎండాకాలం ఎక్కువ నీటిని తాగాలి, పుచ్చకాయలు, పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా కొంతవరకూ ఉపశమనం పొందవచ్చు.
* శరీర తత్వాన్ని బట్టి ఎండకాలంలో చెమట అధికంగా రావడం, చెమట పొక్కులు రావడం జరుగుతుంటుంది. వీటికి డర్మీకూల్ పౌడర్లు వాడటం, మూడు పూటలా స్నానం చేయడం మంచిది.
* ముఖ్యంలో చిన్నారులను, వృద్ధులను ఎండ ప్రదేశాలకు వెళ్లకుండా చేస్తే మంచిది

వడదెబ్బకు 3 లక్షణాలు

* తొలి దశలో శరీరం ఉష్ణాన్ని అధికంగా స్వీకరిస్తుంది. ఈ దశలో గొంతు ఎండిపోవడం, నీరసం రావడం, వాంతులు వచ్చినట్లు అనిపించడం వంటివి గుర్తులు. ఈ పరిస్థితి కనిపించినుప్పుడు తగినంత నీటిని; లేదా నిమ్మకాయ, ఉప్పు, పంచదార కలిపిన నీటిని అధికంగా తీసుకోవాలి.
* రెండో దశలో జ్వరం వస్తుంది. శరీరం వేడెక్కడంతోపాటు మనిషి ఉక్కిరిబిక్కిరవుతాడు. ఇలాంటి సమయంలో చల్లని నీటితో తడిపిన వస్త్రంతో శరీరాన్ని తుడవాలి. చాతిపై పడకుండా ఐస్‌ట్యూబ్స్‌తో తుడవాలి.
* మూడో దశలో మనిషి శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి మనిషి సృహకోల్పోతాడు. మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ మూడు దశలో ఇంటి వైద్యం పనికిరాదు. వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్ళడం శ్రేయస్కరం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *