భాగమతి భీభత్సం-3 రోజుల కలెక్షన్ రిపోర్ట్

సరైన టైంలో పోటీ లేకుండా బరిలో దూకిన భాగమతి బాక్స్ ఆఫీస్ దగ్గర రాజ్యమేలుతోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఈపాటికే చాప చుట్టేసాయి. ఒక్క జైసింహ మాత్రం బిసి సెంటర్స్ లో నెట్టుకొస్తోంది. ఇక యువి సంస్థ చాలా ప్లానింగ్ తో చేసిన ప్రమోషన్, వరల్డ్ వైడ్ హ్యుజ్ రిలీజ్ భారీ కలెక్షన్స్ రావడానికి హెల్ప్ అవుతున్నాయి. స్టార్ హీరో లేకుండా కేవలం అనుష్క బొమ్మకు ఇంత మార్కెట్ ఉందా అని ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతోంది.

ఇక్కడ మరొక కారణం కూడా ప్రస్తావించాలి. సినిమా రిలీజ్ అయిన రోజు నేషనల్ హాలిడే, మరుసటి రోజు చివరి శనివారం, ఆ వెంటనే ఆదివారం ఇలా వరసగా సెలవులు రావడం కూడా బాగా హెల్ప్ అయ్యింది. సినిమా అత్యద్భుతంగా ఉంది అనే టాక్ కాదు కాని మరీ నిరాశ పరచదు అనే మౌత్ పబ్లిసిటీ సినిమాకు బాగా హెల్ప్ అవుతోంది.

ఇక మూడు రోజుల వసూళ్లు పరిశీలిస్తే మొత్తం 16 కోట్ల 70 లక్షల దాకా షేర్ రాబట్టి జైసింహను సైతం క్రాస్ చేసిన భాగమతి మరో పది రోజులు కనక ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ సంవత్సరం ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా చెప్పుకోవచ్చు. కాని అది అంత సులభం కాదు. ఈ రోజు మొదలుకొని వీక్ డేస్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దాని మీదే ఇది ఆధారపడి ఉంటుంది.

ఇక ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో 5 కోట్ల షేర్ కు అతి దగ్గరలో ఉన్న భాగమతి సీడెడ్ లో 1 కోటి 70 లక్షల దాకా రాబట్టి ఔరా అనిపించింది. ఉత్తరాంధ్ర 1.4కోట్లు, గుంటూరు 95 లక్షలు, ఈస్ట్-వెస్ట్ కలిపి 1.6 కోట్లు, కృష్ణా 90 లక్షలు, నెల్లూరు 55 లక్షలతో మంచి షేర్స్ తెచ్చుకుంది. ఇక ఓవర్సీస్ లో 2.7 కోట్లు రాబట్టిన భాగమతి మిలియన్ మార్క్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా భారీ షేర్లు గెలిచిన భాగమతి స్టేటస్ పూర్తిగా తెలియాలంటే ఫస్ట్ వీక్ రన్ పూర్తవ్వాలి. ఎలా చూసుకున్నా హీరొయిన్ ఓరియెంటెడ్ మూవీకి ఇది పెద్ద మార్కే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *