ఏపీ సీఎంగా మహేష్ బాబు ప్రమాణ స్వీకారం: భరత్ అనే నేను ‘ఫస్ట్ ఓథ్’

గణతంత్ర్య దినోత్సవ కానుకగా ‘భరత్‌… అను నేను’ పేరిట ఆడియో బిట్‌ను విడుదల చేసిన దర్శకుడు కొరటాల శివ మరికాసపేటికే ఇంకో ట్రీట్‌ ఇచ్చేశాడు. టైటిల్‌ లోగోతోపాటు మహేష్‌ లుక్కును కూడా రివీల్‌ చేస్తూ ఓ పోస్టర్‌ వదిలాడు.

స్టైలిష్‌ అవతారంలో సీరియస్‌గా బ్యాగ్‌ పట్టుకుని ఆఫీస్‌లో నడుచుకుంటూ బయటకు వస్తున్న మహేష్‌ పోస్టర్‌ స్టన్నింగ్‌ గా ఉంది. ముఖ్యమంత్రి ఛాంబర్‌తో ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ థీమ్‌ కూడా బాగుంది. ఇక ఇంతకాలం ఊరిస్తూ వస్తూ… మేకర్లు ఇప్పుడు ఒక్కోక్కటిగా వరుసపెట్టి వదులుతుండటంతో సూపర్‌ స్టార్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం భరత్‌ అను నేను యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

BharathAneNenu-Mahesh-Babu-First-Oath

ప్రమోషన్లలో కూడా కాస్త వైవిధ్యం కనిపిస్తుండటం విశేషం. కొరటాల శివ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న భరత్‌ అను నేను… ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వాతంత్ర్యం కోసం జరిపిన దండి యాత్ర తరహాలో ఒక సమూహం కలిసికట్టుగా నడవటాన్ని మాత్రమే ఇందులో చూపించారు. ఒకవేళ కొంత టైం తీసుకుని టైటిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ థీమ్ ద్వారా మహేష్ బాబు పూర్తి స్థాయి ముఖ్య మంత్రిగా సీరియస్ రోల్ చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. కైరా అద్వాని హీరొయిన్ గా పరిచయమవుతున్న ఈ మూవీకి శ్రీమంతుడు తర్వాత దర్శకుడు కొరటాల శివ మహేష్ తో మరోసారి జట్టు కట్టాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న భరత్ అను నేను ఏప్రిల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *