భీష్ముడి పేరుని లవర్‌బోయ్ పాత్రకు పేరు పెట్టడం ..
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `భీష్మ`. ఈ నెల 21న విడుదలవుతున్న ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకొనేలా ఉంది. మహాభారతంలో భీష్ముడి పేరుని సినిమా టైటిల్‌గా పెట్టడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని బీజేపీ ధార్మిక సెల్ ఆవేదనను వ్యక్తం చేసింది. టైటిల్ మార్చాలని బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ తూములూరి శ్రీకృష్ణచైతన్య, ప్రధాన కార్యదర్శి రత్నాకరం రాము తదిరతులు డిమాండ్ చేశారు. ఆజన్మబ్రహ్మచారిగా ఉన్న భీష్ముడి పేరుని లవర్‌బోయ్ పాత్రకు పెట్టడం ఏంటని సదరు సభ్యులు ఆరోపించారు. టైటిల్‌ను మార్చాలని లేకుంటే సినిమాను అడ్డుకుంటామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు పేర్కొన్నారు.