భోగి సంబరాలు అంబరాన్నంటాయి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వెలిశాయి. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్ల ముందు భారీగా భోగి మంటలు వేశారు. ప్రజలు భోగి మంటలు వెలిగించి సంక్రాంతి పర్వదినానికి స్వాగతం పలికారు. భోగి మంటలు చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రజలు పండుగను జరుపుకుంటున్నారు.