భువీ బెటర్ హాఫ్ ఎవరో తెలిసిపోయింది!

టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తేల్చేశాడు. ఈ ఏడాది మొదట్లో డేటింగ్‌కు వెళ్తున్నానని, ఆమె ఫొటో తొందర్లోనే రివీల్ చేస్తానని చెప్పిన భువీ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన బెటర్ హాఫ్ ఈమే అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆమె పేరు నుపుర్ నగార్. ఆమె ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఈమెనే బెటర్ హాఫ్ ఆఫ్ ద పిక్చర్ అంటూ కామెంట్ చేశాడు భువీ. 27 ఏళ్ల భువనేశ్వర్.. గతంలో టాలీవుడ్ (బెంగాలీ) నటి అనుస్మృతి సర్కార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చినా అతను ఖండించాడు. తాజాగా తన గర్ల్‌ఫ్రెండ్ ఫొటో ఇదీ అంటూ పబ్లిగ్గానే చెప్పి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు భువీ. ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్.. ఆస్టేలియాతో వన్డే సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మీరట్‌కు చెందిన భువనేశ్వర్.. 18 టెస్టులు, 75 వన్డేలు, 18 టీ20లు ఆడాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *