ధృవ సినిమా వెనుక పెద్ద కథే ఉంది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రెండేళ్లుగా అందకుండా ఊరిస్తున్న విజయం ఎట్టకేలకు ధృవ రూపంలో అందింది. సురేందర్ రెడ్డి టేకింగ్, చెర్రీ నటన, హిప్ హాప్ తమిజా మ్యూజిక్, వినోద్ కెమెరా వెరసి ఓ కలర్ఫుల్ థ్రిల్లర్ ని మన కళ్ళ ముందు ఉంచారు. రిలీజ్ ముందు వరకు మెగా ఫాన్స్ అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి కాని సగటు ప్రేక్షకుడు మాత్రం బాగుంటే అప్పుడు చూద్దాంలే అని వెయిట్ చేసాడు. విడుదల అయ్యాక సీన్ రివర్స్. టికెట్స్ ఫస్ట్ డే దొరికినంత ఈజీగా ఇప్పుడు దొరకడం లేదు. కారణం మౌత్ పబ్లిసిటీ. స్టార్ హీరో అయినప్పటికీ మాస్ ఎలెమెంట్స్ తక్కువగా ఉన్న మూవీ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే 25 కోట్ల మార్క్ ను మూడు రోజుల్లో దాటేసిన ‘ధృవ’ మరో పదిరోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోనున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరోహిట్ ఈ ఇయర్ లోనే పడింది. ‘సరైనోడు’ తర్వాత బ్యానర్ పేరు నిలబెడుతూ మరోహిట్ దక్కడం పట్ల అల్లుఅరవింద్ కూడా మహా ఖుషిగా ఉన్నాడు. కాని ‘ధృవ’ సక్సెస్ ఎంజాయ్ చేయడంలో సింహ భాగం మరో వ్యక్తికి కూడా దక్కుతుంది. అతనే ఒరిజినల్ డైరెక్టర్ రాజా.

తమిళ్ వెర్షన్ ‘తనిఒరువన్’ చూసిన వాళ్ళకు తెలుగు వెర్షన్ లో థ్రిల్ ఉండకపోవడానికి మెయిన్ రీజన్ పెద్ద మార్పులు లేకుండానే రీమేక్ చేయడం. తమిళ్ లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాపై అసలు హైప్ అనేదే లేదు. హీరో జయం రవి అప్పటికే వరస దెబ్బలు తిని మార్కెట్ బాగా కోల్పోయాడు. అతని అన్నయ్య మోహన్ రాజా రీమేక్ కింగ్ గా అప్పటికే పెద్దపేరు. సో స్ట్రెయిట్ సినిమా తీస్తున్నాడు అనగానే అందరికి డౌట్. బడ్జెట్ లిమిట్స్ వల్ల రెండేళ్ళ పాటు నిర్మాణాన్ని సాగదీసారు. ఎట్టకేలకు విడుదల అయ్యింది. మొదటి రెండు రోజులు సైలెన్స్. ఇక ఆ తర్వాత మొదలైంది కలెక్షన్స్ తూఫాను. పది ఇరవై కాదు ఏకంగా 80 కోట్లు కొల్లగొట్టి రవి, రాజా రేంజ్ ను అమాంతం పెంచేసింది. ఆ తర్వాత ఎన్ వి ప్రసాద్ రిమేక్ రైట్స్ కొనడం, సినిమా చెర్రీకి విపరీతంగా నచ్చడం, సినిమా పట్టాలెక్కడం చకచక జరిగిపోయాయి. లాస్ట్ ఇయర్ టాప్ తమిళ్ హిట్స్ లో ఇది ప్లేస్ దక్కించుకుంది. అన్నట్టు రవి, రాజ ఇద్దరు ఎడిటర్ మోహన్ తనయులు. ఎడిటర్ మోహన్ గతంలో మెగాస్టార్ తో ‘హిట్లర్’ లాంటి సినిమా తీసారు. రాజా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తెలుగుదే ‘హనుమాన్ జంక్షన్’. తెలుగులో మాంచి హిట్స్ కొట్టిన ఎడిటర్ మోహన్ తర్వాత తన ఇద్దరు కొడుకులతో చెన్నైలో సెటిల్ అయిపోయి బిడ్డల ఎదుగుదల కళ్ళారా చూసి ఆనందిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *