బిగ్ బాస్-3 తెలుగు ఎపిసోడ్-18 లో ఏం జరిగిందంటే …

బిగ్ బాస్-3 తెలుగు ఎపిసోడ్-18 లో ఈవారం కెప్టెన్ టాస్క్‌లో భాగంగా ఇచ్చిన గేమ్ వయొలెంట్‌గా మారింది. తొలిత బిగ్ బాస్ ఇచ్చిన నిధిని కాపాడుకోవడంలో భాగంగా రెండు టీంలుగా విడిపోయారు. శ్రీముఖి, రవిక్రిష్ణ, అషు రెడ్డి తదితరులు దొంగలుగా ఉండగా.. వాటిని కాపాడుకోవడం కోసం వరుణ్, రాహుల్, వితికా, తమన్నా, మహేష్ అండ్ బ్యాచ్ నిధిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్, శివజ్యోతిలు పోలీసులుగా ఉండగా, హిమజ లాయర్‌గా ఉంది. హిమజ-అలీల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇంట్లో వాటర్ తాగడానికి వెళ్లిన హిమజను అలీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది. రెండోసారి మళ్లీ నీళ్లు తాగే ప్రయత్నంలో ఆమెను అడ్డుకుని ఆమె జేబులో చేయిపెట్టి డబ్బులు లాక్కుంటూ ఆమెపై ఫిజికల్ ఎటాక్ చేయబోగా.. కాపాడుకునే ప్రయత్నంలో అతని ముఖంపై తన్నేసింది హిమజ. దీంతో ఇద్దరి మద్య గొడవయ్యింది. తరువాత హిమజ సారి చెప్పిన అలీ రాజా వినకుండా ఆమెతో వ్యక్తిగత దూషణకు మొదలెట్టాడు. దీనితో హిమజ అతని అతని కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. అయిన వినకపోయేసరికి ఏడ్చింది. ఇక మధ్యలో కల్పించుకున్న తమన్నా.. ఆమెసారి చెప్తూ కాళ్లపై పడినా.. నువ్ ఏంటి రెచ్చిపోతున్నావ్ అంటూ తనదైన శైలిలో అలీపై ఎటాక్‌కి దిగింది. అయితే అలీ కూడా తమన్నాపైకి దూసుకువెళ్లాడు. అయితే కాసేపటి అలీ వచ్చి హిమజతో కూల్‌గా మాట్లాడటంతో పరిస్ధితి సద్దుమణిగింది. ఇక ఈ కెప్టెన్ టాస్క్‌ను తొలి నుండి సాఫ్ట్‌గా ఆడుతున్న యాంకర్ శ్రీముఖి వరుణ్‌ సందేశ్ బోల్తా కొట్టించింది. అతన్ని మాటల్లో పెట్టి జోబులో ఉన్న డబ్బుని కొట్టేసింది. శ్రీముఖి టీంలో ఉన్న రవిక్రిష్ణను జైలులో వేయడంతో శ్రీముఖి, అషులు గేమ్ ఆడటం కోసం కష్టపడ్డారు. శ్రీముఖి డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టాలని డిసైడ్ అయ్యి చుట్టు వరుణ్, వితికా, తమన్నా, మహేష్‌లు కాపలా ఉన్నా ధైర్యం చేసి డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టింది. అప్పుడే జైలు నుండి వచ్చిన రవిని సైతం పగలగొట్టమమని శ్రీముఖి సలహా ఇవ్వడంతో అతను చేతితో అద్దాలను పగలగొట్టడంతో అతని చేతికి గాయమై రక్తం కారింది. దీంతో హౌస్‌కి డాక్టర్ వచ్చి కట్టు కట్టారు. మరోవైపు శ్రీముఖి వల్లే రవికి గాయం అయ్యిందని ఆమెపై అటాక్ చేశారు వితికా, రాహుల్‌లు. ఈమె పగలగొట్టమని చెప్పింది అంటూ శ్రీముఖిపై అంతెత్తున లేచాడు రాహుల్. వితికా సైతం ఆమె కొట్టమంది అతను చేతిలో ఏం లేకుండానే పగలగొట్టేశాడు అంటూ ఏడుపు మొదలుపెట్టింది. మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్ టాస్క్ తిట్లు, కొట్టుకోవడానికే పరిమితం కాకుండా వ్యక్తిగత దూషణలు పర్శనల్ ఎటాక్ వరకూ వెళ్లింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *