ఎగ్స్ కోసం బిగ్ బాస్ లో పోట్లాట

బిగ్ బాస్ -3 24వ ఎపిసోడ్ లో డ్రాగన్ ఎగ్స్ కోసం పోరాటం జరిగింది. బిగ్గ్ బాస్ కెప్టెన్సీ కోసం టాస్క్ లో భాగంగా ఇచ్చిన టాస్కూలు చాలా సరదాగా ఉన్నాయి. గార్డెన్ ఏరియాలో టాస్క్ కు సంబంధించిన అన్ని ఏర్పాటు ముందే చేశారు. అక్కడ మూడు డ్రాగన్స్ ఎగ్స్ ఉంటాయి. బర్జర్ మోగగానే మూడు డ్రాగన్ ఎగ్స్ ను ఎవరైతే సొంతం చేసుకుంటారో ఆ ముగ్గురు సభ్యులకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ బర్జర్ మొగగానే పరిగెడతారు. కానీ వితిక, శివజ్యోతి, రోహిణి డ్రాగన్ ఎగ్స్ ని సొంతం చేసుకుంటారు. తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ రెండు టిమ్ లుగా విడగొట్టి,రెడ్ టీంకి శ్రీముఖిని బ్లూ టీంకి హిమజని లీడర్స్ గా పెట్టి రెండు రాజ్యాలుగా విడగొడతారు. ఆ రాజ్యాలకు రెడ్, బ్లూ జెండాలను కూడా ఇస్తారు. రెడ్ టీమ్ కి  శ్రీముఖి.. అలీ, రాహుల్, మహేశ్, అషును తన టీమ్ సభ్యులుగా ఎంపిక చేసుకుంటుంది. బ్లూ టీమ్ కి హిమజ… వరుణ్, పునర్నవి, బాబా భాస్కర్, రవిని తన టీమ్ సభ్యులుగా చేసుకుంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం బర్జర్ మోగగానీ రెడ్ జెండా ఉన్నవాళ్ళు వేరే రాజ్యానికి వెళ్ళి జెండాను పాతలి. అలాగే బ్లూ జెండా ఉన్నవాళ్ళు వేరే రాజ్యానికి వెళ్ళి పాతలి. అయితే ఆ జెండాలను తొలగించే హక్కు సంబందిత రాజ్యం వాళ్ళకు ఉంటుంది. తెలివిగా అది చివరి బర్జర్ మొగెవరకు ఎవరి జెండాలు ఎక్కువగా ఉంటాయో వల్లే విజేత. జండాల కోసం, గుడ్లు కోసం ఒకరిపై ఒకరు పడుతూ లాక్కుంటూ పీక్కుంటూ కొట్టుకుంటూ ఒకరిపై ఒకరు పడుతూ యాక్షన్ ఫీట్లు ఫైట్లు చేశారు. ఇంటి సభ్యులు ఎంతసేపు టాస్క్ ఆడకుండా డ్రాగన్ ఎగ్స్ కోసమే కొట్లాడటంతో చివరకు ఏ టీమ్ కూడా గెలవలేకపోయింది. దీంతో చివరగా డ్రాగన్ ఎగ్స్ ను సొంతం చేసుకున్న రవి, రాహుల్, అలీ.. ఈ ముగ్గురు కెప్టెన్సీ టాస్క్ కోసం సెకండ్ లేవల్ కు వెళ్లారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *