బిగ్ బాస్-3: పునర్నవి రాహుల్ లైన్లోకి వచ్చిందా?

బిగ్ బాస్-3 27వ ఎపిసోడ్ అంతా సరదాగా సాగింది. మొదట బాబా భాస్కర్, శ్రీముఖి వంటగదిలో ఆయిల్ గురించి చర్చించుకున్నారు. తర్వాత డైనింగ్ టేబుల్ మీద వితికాతో పాటు రాహుల్-పునర్నవిలు ఒకే ప్లేట్‌లో తింటూ ముచ్చట్లు పెట్టారు. పునార్ణవి రాహుల్ కి తినిపిస్తూ ఉండగా వితిక మిమ్మల్ని ఇలా చూస్తే మీకు పెళ్లి అవ్వదు అంటుంది. అయితే దానికి పునర్నవి తినిపిస్తే తప్ప అంటూ రాహుల్ కి తినిపిస్తుంది. ఇక రాహుల్ విషయానికి వస్తే పునర్నవి చేతి ముద్దలు తింటూ ఎంజాయ్ చేశాడు. ఎంత టేస్ట్ గా ఉందో ఈమె తినిపిస్తుంటే అంటూ ఆస్వాదించాడు. మీరు ఇలా చేస్తే పుకార్లు వస్తాయి అని వితికా అనడంతో అయితే నేనే తింటాలే అని పునర్నవి ప్లేట్‌లో చేయిపెట్టి తింటూ, ఇది పెద్దగా టేస్ట్ అనిపించడంలేదు. పునర్నవి తినిపిస్తే టేస్ట్‌ గా ఉందంటూ తనదైన శైలిలో పులిహోర కలిపి పునర్నవిని లైన్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు.

అటు తరువాత హౌస్‌లో ఉన్న పురుషులు, మహిళలను రెండు గ్రూప్‌లుగా చేసి వారికి జీకే క్వచ్ఛన్స్ పెట్టారు. ఈ టాస్క్‌లో శివజ్యోతి ప్రశ్నలు అడగగా.. కంటెస్టెంట్స్ ఆన్సర్‌లు ఇచ్చారు. హోరా హోరీగా సాగిన ఈ ఆటలో మహిళలపై పురుషులు విజయం సాధించారు. రక్షా బంధన్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో రాఖీ సంబరాలు జరిగాయి. కంటెస్టెంట్స్‌కి వాళ్ల ఇంటి దగ్గర నుండి పంపించిన రాఖీలు హౌస్‌లో ఉన్న వాళ్లతో కట్టించుకుని ఎమోషన్ అయ్యారు. వరుణ్ సందేశ్‌కి హిమజ,పునర్నవి లు రాఖీ కట్టగా, రవికృష్ణ కి రోహిణి, హిమాజాలు కట్టారు. అలీకి శివజ్యోతి రాఖీ కట్టి ఎప్పటిలాగే గుక్కపెట్టి ఏడ్చేసింది. శ్రీముఖి మాత్రం తన తమ్ముడు పంపిన రాఖీని ఎవరితోనూ షేర్ చేసుకోలేనని.. ఆ రాఖీ నేను కట్టించుకుంటా అంటూ బాబా భాస్కర్‌లో కట్టించుకుంది శ్రీముఖి. బాబా భాస్కర్.. శ్రీముఖికి రాఖీ కట్టి మంచి భర్త రావాలని ఆశీర్వదించారు.

ఇదిలా జరుగుతుంటే పునర్నవి తను రాఖీ కట్టేటప్పుడు వరుణ్ సందేశ్, రాహుల్‌లు పక్కనే కూర్చుని ఉన్నారు. ఈ సందర్భంలో అతన్ని చూస్తే మా తమ్ముడు గుర్తొస్తాడు.. అతనిలో మా తమ్ముడ్ని చూస్తున్నా అని వరుణ్ ఉద్దేశించే అనగా.. పక్కనే ఉన్న రాహుల్‌ కంగారయ్యాడు. ఆమె ఇటు చూస్తుంటే కంగారు వచ్చింది, పారిపోదాం ఇక్కడ నుండి అనుకున్నా అని రాహుల్ అనడంతో హౌస్‌లో నవ్వులు మొదలయ్యాయి. ‘హౌస్ ఉన్న వాళ్లందరికీ రాఖీ శుభాకాంక్షలు ఒక్క రాహుల్‌కి తప్ప అంటూ రాహుల్ లైన్‌లోకి వచ్చినట్టుగా ఇన్ డైరెక్ట్‌గా చెప్పింది పునర్నవి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *