బిగ్ బాస్-3 ఎపిసోడ్-36 రివ్యూ

బిగ్ బాస్-3 36వ ఎపిసోడ్ నాగార్జున ఎంట్రీతో మొదలయ్యింది. మొదట ఆయన మన టీవి ద్వారా హౌస్ మేట్స్ అందరినీ పలకరించారు. నాగార్జున ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ తో రెండు గేమ్స్ ని  ఆడించారు. అవి మాస్క్ గేమ్ మరియు రోల్ ప్లే. మొదట నాగార్జున కెప్టెన్ శివజ్యోతి ని పిలచి స్టోర్ రూమ్ కి వెళ్ళి అక్కడ వున్న జంతువుల మాస్క్ లను తీసుకురమ్మన్నారు. ఇప్పుడు నాగార్జున ఒక్కొక్క జంతువు పేరు చెప్పి దాని బిహేవియర్ కూడా చెబుతుంటే శివజ్యోతి వెళ్ళి ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరికి పెట్టాలి. దానికి కారణం కూడా చెప్పాలి. అలా శివజ్యోతి మొదట ఆలికి సింహం మాస్క్ ని తగిలించింది. తర్వాత నక్క మాస్క్ ని మొదట బాబా భాస్కర్ కు పెట్టి మళ్ళీ దాన్ని మహేష్ కి పెట్టింది. జింక మాస్క్ ని రాహుల్ కి, ఏనుగు మాస్క్ ని హిమజకి, కోటి మాస్క్ ని శ్రీముఖికి, ఊసరవెల్లి మాస్క్ ని బాబా భాస్కర్ కి, శునక మాస్క్ ని రవి కృష్ణకి, పాము మాస్క్ ని ఆషూకి, తాబేలు వరుణ్ సందేశ్ కి,కుందేలు ని పునర్నవికి, గొర్రెపిల్ల ని వితికాకి పెట్టింది.

తరవాత ఇంటి సభ్యులకు నాగార్జున మరో సరదా టాస్క్ ఇచ్చారు. 12 మందిని ఆరు జంటలుగా విభజించారు నాగార్జున. బాబా భాస్కర్ – అషురెడ్డి, హిమజ – రవికృష్ణ, శ్రీముఖి – రాహుల్, మహేష్ – శివజ్యోతి, పునర్నవి – వరుణ్, వితికా – అలీ జంటలుగా ఏర్పడ్డారు. ఈ జంటలు ఒకరు మరొకరిలా ప్రవర్తించి, వారిలా నటించాలి. అంటే అషురెడ్డిలా బాబా భాస్కర్.. బాబా భాస్కర్‌లా అషురెడ్డి నటించాలన్నమాట. ఈ టాస్క్ కూడా చాలా సరదాగా సాగింది. ఎపిసోడ్‌లో మొదటిగా బాబా భాస్కర్‌ను నాగార్జున సేఫ్ జోన్‌లో వేశారు. ఆ తరవాత ఒక బెలూన్‌లో చీటి పెట్టి.. దాన్ని మహేష్‌తో పగలగొట్టించి.. ఆ చీటీలో ఉన్న పునర్నవి పేరును ప్రకటించారు. అనంతరం రాహుల్ సేఫ్‌ అయ్యాడు. ఇక అషురెడ్డి, వితికా షెరు మిగిలారు. ఇద్దరిలో అషురెడ్డి ఎలిమినేట్ అయ్యినట్టు నాగార్జున ప్రకటించారు. హౌస్‌లో నుంచి బయటికి వస్తూ జిగేలు రాణి పాటకు అషు స్టెప్పులేసింది.

తరువాత బిగ్ బాస్ హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన అషురెడ్డిని నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు. ఆమె ముందు ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల బొమ్మలన్నీ ఉంచారు. అవి టైల్స్‌పై అతికించిన బొమ్మలు. హౌస్‌లో ఎవరైతే ఉండాలని కోరుకుంటున్నావో ఆ ఫొటోలు ఉంచి మిగిలినవి పగలగొట్టమని నాగార్జున సూచించారు. ఆ తరవాత ఒక్కో ఫొటో పట్టుకుని ఆ హౌస్‌మేట్ ఇంట్లో ఉండాలా, వద్దా అనడానికి కారణం చెబుతూ అషు పగలగొట్టింది. ఇంట్లో ఉండకూడదని రాహుల్, వితికా, మహేష్, హిమజ ఫోటోలను పగలగొట్టగా, ఇంట్లో ఉండాలని శివజ్యోతి, శ్రీముఖి, పునర్నవి, బాబా భాస్క, వరుణ్ సందేశ్, రవి కృష్ణ పేర్లను చెప్పింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *