బిగ్ బాస్ పై పునర్నవి ఫైర్

బిగ్ బాస్-3 52వ ఎపిసోడ్ శ్రీముఖి, బాబా భాస్కర్ సంభాషణతో మొదలయింది. వీరిద్దరు బాబా భాస్కర్ రవి ని సేవ్ చేయడం గురించి సంభాషించారు. మీరు రవిని సేవ్ చేసినందుకు నేను బాధ పడట్ల కానీ మీరు వచ్చి బాధపడుతున్నవా అనడం నాకు నచ్చలేదు అని శ్రీముఖీ బాబా గారితో అంటుంది. ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్ లో భాగంగా ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో బాబా భాస్కర్, హిమజ, రాహుల్, వితికా, శిల్పాలు దెయ్యాలుగా ఉంటారు. వీరు ఇంట్లో మిగిలిన వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రాహుల్, రవి, మహేష్‌లకు విసుగుతెప్పించాలి. వారు రియాక్ట్ అయ్యేలా చెయ్యాలి. అయితే ఈ టాస్క్ లో మనుషులను చంపాలి. చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా, దెయ్యాలు మనుషులుగా మారుతారు. వరుణ్‌కి మూడు ముద్దులు పెట్టి బాత్రూం మిర్రర్‌పై వరుణ్ గోస్ట్ అని రాయాలని.. శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టాలని.. పునర్నవిని పూల్‌లోకి తోసేయాలని.. రవిని డాన్స్ వేసేట్టు చేయాలని.. మహేష్‌ని ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా చేయాలని దెయ్యాలకు టాస్క్‌ లు ఇచ్చారు బిగ్ బాస్.

ఇక ఈ టాస్క్ ల్లో వితికా గెలిచి మనిషిగా మారింది. వరుణ్ దెయ్యంగా మారాడు. హిమజ శ్రీముఖి తలపై గుడ్డు పగులకొట్టడంతో హిమజ మనిషిగా మారింది. శ్రీముఖి దెయ్యంగా మారింది. కానీ పునర్నవిని ఈడ్చికెళ్లి స్విమ్మింగ్ పూల్ వేయడంతో  సీరియస్ అయ్యింది. చాలా సేపు స్విమ్మింగ్ పూల్‌లో ఉండిపోయిన తిరిగి పైకి ఎక్కే సందర్భంగా శిల్పా వచ్చి మళ్లీ స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అయితే శిల్ప చేతిలో పునర్నవి ప్రాణాలను కోల్పోయిందని.. శిల్ప మనిషిగా, పునర్నవి దెయ్యంగా మారతారని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ రావడంతో ఒక్కసారిగా విరుచుకు పడింది. అసలు ఈ టాస్క్ ఏంటని? నేను ఏమి జరిగిన రియాక్స్త్ కాలేదు అయిన ఓడిపోయాన అని వరుణ్ తో అంటుంది. తర్వాత బిగ్ బాస్ తో ఇది ఒక బూల్ షీట్ టాస్క్ అని…దాన్ని మీరే ఆడుకోమని  సీరియస్ అయ్యింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *