పిచ్చి టాస్క్ లు ఇవ్వొద్దు బిగ్ బాస్: పునర్నవి

బిగ్ బాస్-3 53వ ఎపిసోడ్ లో పునర్నవి బిగ్ బాస్ పై ఫైర్ అయ్యింది. ఇలాంటి బుల్ షిట్ గేమ్‌లు ఇవ్వొద్దు అంటూ బిగ్ బాస్‌కే వార్నింగ్ ఇచ్చిన పునర్నవి రెండో రోజు చెలరేగింది. టాస్క్‌ లు ఇచ్చేటప్పుడు సరిగా ఇవ్వండి. వాళ్లకు ఒకలా మాకు ఒకలా చెప్పే పిచ్చి టాస్క్‌ లు ఇవ్వొద్దు. ఎప్పుడు బిగ్ బాసే రైట్ అనుకోవద్దు. నువ్ ఎప్పుడూ రైట్ కాదు అంటూ ఫైర్ అయ్యింది.

ఇక తర్వాత రాహుల్ పునర్నవి మధ్య సంభాషణ జరిగింది. రాహుల్ ‘నన్ను ఇగ్నోర్ చేస్తున్నావ్’ అన్నాడు. నువ్వు  నా పట్ల కేర్ చూపిస్తుంటే ఖచ్చింగా ఏదో ఉందనే అనుకుంటారు. దాంట్లో ఏం తప్పు ఉంది అంటూ పునార్ణవిని అడిగాడు.

దెయ్యాల చేతిలో తొలిరోజు వరుణ్, పునర్నవి, శ్రీముఖిలు ప్రాణాలను కోల్పోగా రెండో రోజు రవి, మహేష్‌లు ప్రాణాలను పొగొట్టుకుని దెయ్యాలుగా మారారు. మహేష్‌తో 5 షర్ట్‌ లు మార్పించాలని రాహుల్‌కి సీక్రెట్ టాస్క్ ఇవ్వగా.. అతనితో షర్ట్‌ లు మార్పించేందుకు కష్ట పడ్డాడు రాహుల్. తరువాత ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్ ముగిసిందని ప్రకంటిచారు బిగ్ బాస్. ఈ టాస్క్‌ లో బాబా భాస్కర్, హిమజలు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారని.. కాని శ్రీముఖి, పునర్నవి, మహేష్ విట్టాలు ఈ టాస్క్‌ ని తేలికగా తీసుకున్నారన్నారు. అంతే కాకుండా టాస్క్ రహస్యాలను బయటకు చెప్పి నిబంధనల్ని అతిక్రమించారని అందుకు ఈ ముగ్గుర్నీ చెత్త పెర్ఫామర్స్‌గా ప్రకటించారు బిగ్ బాస్.

దీనికి శిక్షగా.. శ్రీముఖి, పునర్నవి, మహేష్‌లకు లగ్జరీ బడ్జెట్ ఈ ముగ్గురికి లభించదన్నారు. అంతే కాకుండా ఈ ముగ్గురికీ మరో ఎక్ ట్రా టాస్క్ ఇచ్చారు. ఎలాంటి పని ఇచ్చినా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలంటూ షూ పాలిష్ చేయాలని ఒక్కొక్కరికీ వందకి పైగా షూలను ఇచ్చారు. వీటితో పాటు మిగతా ఇంటి సభ్యుల షూలను క్లీన్ చేయాలని శిక్ష విధించారు. దీనితో పునర్నవి ఇంటి నుండి వెలిపోవడానికైనా సిద్ధమే తప్పితే నేను షూ పాలిష్ చేయను అని బిగ్ బాస్‌ నిర్ణయాన్ని తిప్పికొట్టింది. మహేశ్ కూడా దీనికి వ్యతిరేకించాడు.

అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను కంప్లీట్ చేయకపోతే డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తాం అని హెచ్చరించడంతో శ్రీముఖి ముందుగానే చెప్పులు తుడిచేందుకు సిద్ధపడింది. ఇక మహేష్‌ని శివజ్యోతి కన్వెన్స్ చేయడంతో వెనక్కి తగ్గి అయిష్టంగానే షూ పాలిష్ చేశాడు మహేష్. అయితే పునర్నవి మాత్రం దీనికి ఒప్పుకోలేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *