బిగ్ బాస్ నుండి శిల్పా అవుట్

బిగ్ బాస్-3 57వ ఎపిసోడ్ నాగార్జున ఎంట్రీ తో మొదలయింది. మన టీవి ద్వారా అందరినీ పలకరించిన నాగార్జున వారికి నాలుగు ఫన్నీ టాస్క్ లు ఇచ్చారు. ఆయనే ఒక టాపిక్ ఇచ్చి దానిపై స్కిట్ చేయాలని హౌస్‌ మేట్స్‌ లో కొంత మంది పేర్లు చెప్పారు. ఇలా డిఫరెండ్ డిఫరెంట్ కంటెస్టెంట్లను కలిపి నాలుగు స్కిట్‌లు చేయించారు. ఇవన్నీ చాలా సరదాగా నడిచాయి. తన పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులకు కంటెస్టెంట్స్ మంచి వినోదాన్ని పంచారు. ఆ తరువాత నాగార్జున హౌస్ మేట్స్ తో జింగిల్స్ చేయించారు. రాహుల్ షూట్ కేస్ మీద ద్రమ్స్ వాయిస్తూ పాటలు పాడాడు. ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో పాట. ఆ పాటకు అనుగుణంగా ఆ కంటెస్టెంట్ యాటిట్యూడ్ చూపించాలి. ఇది కూడా చాలా సరదాగా సాగింది. ఈ టాస్క్ మధ్యలో నాగార్జున శ్రీముఖి, మహేశ్ లను సేఫ్ జోన్ లో వేశారు.

అయితే ఎలిమినేషన్ లో ఉన్న మిగిలిన ఇద్దరు పునర్నవి, శిల్పాలను  నాగార్జున ఒకరిని కన్‌ఫెషన్ రూంలోకి, మరొకరిని కోర్టు యార్డ్‌లోకి వెళ్లమని చెప్పారు. శిల్పా కన్ఫెషన్ రూంలోకి, పునర్నవి కోర్టు యార్డులోకి వెళ్లాక డోర్లు లాక్ చేసుకోవాలని సూచించారు. కౌంట్ డౌన్ పూర్తయ్యాక ఎవరి డోర్ ఓపెన్ అయితే వాళ్లు లివింగ్ రూంలోకి వచ్చేయాలని చెప్పారు. కౌంట్ డౌన్ పూర్తయ్యే సరికి పునర్నవి డోర్ లాక్ అయిపోయింది. శిల్పా డోర్ ఓపెన్ చేసుకుని లివింగ్ రూంలోకి వచ్చింది. శిల్పానే ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. దీనితో అందరూ ఆమెకు నవ్వుతూ వీడ్కోలు పలికారు.

హౌస్ నుండి బయటకు వచ్చిన శిల్పకు వేదికపైకి ఆహ్వానించారు నాగార్జున. తర్వాత శిల్పకు ఒక టాస్క్ ఇచ్చారు. దాని ప్రకారం కాగితాల మీద రాసి వున్న బిరుదులను ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో బిరుదు ఇవ్వాలి. వజ్యోతి – రాక్షసి, మొండోడు – రవికృష్ణ, కోపిష్టి – రాహుల్, మూర్ఖురాలు – పునర్నవి, గయ్యాలి – వితిక, అహంకారి – హిమజ, జిత్తులమారి – బాబా భాస్కర్, అవకాశవాది – శ్రీముఖి అయితే, వరుణ్ సందేశ్‌కు శిల్పా ఎలాంటి బిరుదు ఇవ్వలేదు. వరుణ్ కూల్ డ్యూడ్ అని చెప్పింది. అయితే చివరి టాస్క్ గా ఆమెతో ఒక బిగ్ బాంబ్ వేయించాడు నాగార్జున. దీని ప్రకారం హౌస్ లో ఎవరైనా పగలు నిద్రపోయినప్పుడు కుక్క మోరిగితే వాళ్ళు పుల్లో దూకలి. దీనితో శిల్పా బిగ్ బాంబ్ ని మహేష్ పై విసిరింది. అయితే ఎవరు నిద్రపోయిన మహేష్ దూకాలనేది ట్విస్ట్….

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *