బిగ్ బాస్: రాహుల్ కి కిస్ ఇచ్చిన పున్ను

బిగ్ బాస్-3 58వ ఎపిసోడ్ ఆగట్టున ఉంటావా ఈ గట్టున ఉంటావా అనే సాంగ్ తో మొదలయ్యింది. ఈ రోజు ఎపిసోడ్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. మహేష్, వరుణ్, పునర్నవి ల మధ్య నామినేషన్ గురించి చర్చ జరిగింది. శ్రీముఖి ని ఎవరు నామినేట్ చేయట్లేదాని చర్చించారు. దీనితో వరుణ్ అలీ ని కూడా మనం ఇదే రీజన్ తో చేశాం ఇప్పుడు శ్రీముఖిని కూడా ఇదే రీజన్ తో చెయ్యొచ్చని సలహా ఇచ్చారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో టెలిఫోన్ బూత్‌కి బిగ్ బాస్ ఫోన్ కంటెస్టెంట్స్‌ తో మాట్లాడారు. మొదటిగా ఫోన్ రింగ్ కావడంతో ఆవేశంగా వచ్చి ఎప్పటిలాగే అత్యుత్సాహంగా ఫోన్ లిఫ్ట్ చేసింది శ్రీముఖి. అయితే ఆమె మొదటిగా ఫోన్ లిఫ్ట్ చేయడం వల్ల డైరెక్ట్‌ గా నామినేట్ అయ్యిందని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్ నుండి బయటపడే అవకాశాన్ని ఇచ్చారు.

బాబా భాస్కర్‌ గెడ్డాన్ని క్లీన్ షేవ్ చేసుకుంటే మీరు నామినేషన్ నుండి సేవ్ అవుతారని లేదంటే మీరు డైరెక్ట్‌గా నామినేట్ అవుతారని అనడంతో బాబా భాస్కర్‌కి విషయాన్ని చెప్పింది శ్రీముఖి. దీనికి బాబా భాస్కర్ ఓకే చేసి క్లీన్ షేవ్‌కి ఒప్పుకున్నారు. అలాగే పునర్నవి కోసం రాహుల్ ఏకంగా 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగాడు. మధ్యలో చేదుకు వాంతులు అవుతున్నా.. పున్నూపై ఉన్న ప్రేమతో కక్కుకుంటూనే టాస్క్‌ ను కంప్లీట్ చేశాడు. దీనితో పున్ను రాహుల్ కి ముద్దు పెట్టి, హగ్  చేసుకుంది. వీరితో పాటు రాహుల్ కోసం చేతిపై బిగ్ బాస్ ఐ టాటూ వేయించుకుంది శ్రీముఖి. ఇక శివజ్యోతి కోసం మహేష్ తన జుట్టుకి రంగువేసుకోగా.. బాబా భాస్కర్ కోసం తన షూస్ మొత్తాన్ని ఎరుపు రంగు డబ్బాలో ముంచి త్యాగం చేశాడు రవి.

అయితే హిమజ కోసం వరుణ్ చేసిన త్యాగం ఛాలెంజింగా అనిపించింది. హిమజ కోసం పేడ టబ్‌లో షర్ట్ లేకుండా పడుకున్నాడు వరుణ్. అయితే పేడ మరీ కంపు రావడంతో వాంతులు చేసుకున్నాడు వరుణ్. దీనితో భర్తకు సపర్యలు చేసే క్రమంలో లోపలి నుండి పరుగుపరుగున కవర్ తీసుకు వస్తూ కాలి జారి గట్టిగా పడింది వితికా. ఆమెకు దెబ్బ గట్టిగా తగలడంతో లేవలేకపోయింది రాహుల్ ఎత్తుకుని ఆమెను బెడ్‌పైకి తీసుకువెళ్లాడు. అయితే ఈ టాస్క్ వద్దు వరుణ్ అన్నా.. నేను నేరుగా నామినేట్ అవుతా.. బిగ్ బాస్ ఈ టాస్క్ రద్దు చేయండి అంటూ వేడుకుంది హిమజ. అయిన తన మాట వినకుండా వరుణ్ టాస్క్ పూర్తి చేశాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *