వరుణ్ సేవ్ చేస్తే… వితికా నామినేట్ చేసింది…

బిగ్ బాస్-3 59వ ఎపిసోడ్ హిమజను నామినేషన్ నుండి తప్పించడానికి వరుణ్ పేడలో పడుకోవడంతో నామినేషన్ నుండి హిమజ బయటపడిందని తెలిపారు. దీనితో నా జీవితంలో ఎవరైనా గొప్ప త్యాగం చేశారు అంటే అది ఇదే అంటూ ఎమోషన్ అయ్యింది హిమజ. అనంతర రవితో మాట్లాడిన బిగ్ బాస్.. మీరు ఈవారం నామినేషన్‌కి డైరెక్ట్‌గా నామినేట్ అయ్యారని దీన్నుండి బయట పడాలంటే శివజ్యోతి తన జుట్టుని షోల్డర్ వరకూ కట్ చేసుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని శివజ్యోతికి రవి చెప్పగానే రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్పింది శివజ్యోతి. ఒకసారి ఆలోచించు అక్కా అని రవి అన్న వినకుండా జుట్టు కత్తిరించుకుంది శివజ్యోతి. రాహుల్ సేవ్ కావాలంటే పునర్నవి తనను తాను సీజన్ మొత్తం నామినేట్ చేసుకోవాలని చెప్పారు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్ కోసం పునర్నవి, రాహుల్‌ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఇద్దరు నేను నామినేట్ అవుతా అంటే నేను అవుతా అంటూ వాదించారు. చివరికి రాహుల్ చెప్పిన దానికి పునర్నవి కన్వెన్స్ అవడంతో బిగ్ బాస్ రాహుల్ ఈవారం ఎలిమినేషన్‌ని రాహుల్ నామినేట్ అయినట్టు ప్రకటించారు.

ఇక ఎప్పటిలాగే బిగ్ బాస్ కెప్టెన్‌గా ఉన్న వితికాకు తన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఒకర్ని నేరుగా నామినేట్ చేయాల్సిందిగా కోరారు బిగ్ బాస్. దీంతో హిమజను నామినేట్ చేస్తూ మహేష్‌ను నామినేషన్ నుండి తప్పించలేకపోవడం వల్ల ఆమెను నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది వితికా. ఆ తరువాత వితికా, పునర్నవిలు వరుణ్ పేడలో పడుకోవడం గురించి మాట్లాడుతుండగా.. పున్ను హిమజ మీద అక్కసు వెళ్లగక్కింది. దీనితో వరుణ్ ఫైర్ అయ్యాడు.

నాకోసం శ్రీముఖి పచ్చబొట్టు పొడుపించుకుంది.. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. నేను పేడలో పడుకుంటే నష్టం ఏమిటి? అని వరుణ్ అనడంతో.. ‘చేయడం ఓకే కాని.. ఎవరి కోసం చేస్తున్నామన్నదీ ముఖ్యమే కాదా’ అని పునర్నవి అనడంతో వరుణ్ కి కోపం వచ్చింది. నీ ఒపీనియన్ నీకు ఉంటుంది నా ఒపీనియన్ నాకు ఉంటుంది. హిమజను సేవ్ చేసిన దగ్గర నుండి యాటిట్యూట్ చూపిస్తున్నావ్.. పేడలో పడుకుంది నేను కదా.. నువ్ కాదు కదా.. నువ్ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్’ అంటూ క్లాస్ పీకారు వరుణ్.

పునర్నవికి నేను అంటే ఎందుకు అంత ద్వేషమో నాకు అర్ధం కావడంలేదు అంటూ ఫీల్ అయ్యింది హిమజ. మొత్తానికి ఈ నామినేషన్ ప్రక్రియ ముగియడంతో తొమ్మిదోవారం ఎలిమినేషన్‌కి మహేష్, రాహుల్, హిమజ ముగ్గురూ నామినేట్ అయినట్టు ప్రకటించారు బిగ్ బాస్ ఈ ముగ్గురులో ఒకరు బిగ్ బాస్ హౌస్‌ నుండి ఈవారం ఎలిమినేట్ కాబోతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *