మళ్ళీ ఏడుపు మొదలుపెట్టిన జ్యోతక్క…వాళ్ళిద్దరూ దుప్పట్లో ఏం చేస్తున్నారు…

బిగ్ బాస్-3 60వ ఎపిసోడ్ కు చేరుకుంది. తొమ్మిదో వారం ఎలిమినేషన్ భాగంగా ఒకరికొకరు చేసిన త్యాగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తొమ్మిదో వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యింది మహేష్, హిమజ, రాహుల్. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ కాలేజ్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్ లో క్రేజీ టీచర్ గా వితికా పెర్ఫర్మ్ చేయగా, స్టూడెంట్ గా శివజ్యోతి చేసింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పరీక్షలు పెట్టారు. వీటిక గాసిప్ లెక్చరర్ గా మూడు రౌండ్ల పరీక్ష పెట్టింది. శివజ్యోతిని పిల్చి అసలు గాసిప్ అంటే ఏమిటి? అది ఎలా పుడుతుంది అని అడిగింది. దానికి శివజ్యోతి ”పుకార్లు పుట్టించడం మేడమ్.. ప్రస్తుతానికి ఈ గాసిప్‌లో మిమ్మల్ని వాడుకుంటా ఏం అనుకోవద్దు.” గాసిప్ అంటే ఎలా ఉంటుందంటే.. ”వరుణ్ సందేశ్, వితికా బిగ్ బాస్ హౌస్‌లో రాత్రి లైట్లు బంద్ చేసిన తరువాత లోపల బిగ్ షీట్‌లో ఏమోనట అంటూ చేతిలో ఉన్న పెన్‌కి కేప్ పెడుతూ.. వితికా వరుణ్‌‌ని బాగా డబ్బులున్నాయనే చేసుకుందట” అని తనదైన శైలిలో గాసిప్ అల్లేసింది శివజ్యోతి. అంతే దెబ్బతో వితిక కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తమాయించుకుని ఓకే నువ్వు వెళ్ళొచ్చు అంటూ శివజ్యోతిని సాగనంపింది.

టాస్క్ మధ్యలో శివజ్యోతి తన ఆట తను ఆడకుండా.. ఎమోషనల్‌గా ఎదుటి వ్యక్తులపై డిపెండ్ అవుతున్నారని బాబా బాస్కర్ అనడంతో ఏడుపు మొదలుపెట్టింది. దీనితో రవి, హిమజ, బాబా ఆమెను ఒదర్చే ప్రయత్నం చేశారు. నేను ఏరోజు ఎవరిపై ఆధారపడ్డానో చెప్పాలని మొదట రాహుల్‌ని ప్రశ్నిస్తూ కన్నీళ్లు పెట్టుకోగా.. నువ్ తప్పుగా అర్ధం చేసుకున్నావని మేం అలా అనలేదన్ని అన్నారు రాహుల్. అనంతరం బాబా భాస్కర్ సీన్‌లోకి ఎంటరై శివజ్యోతికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తప్పైపోయింది.. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల నీకు తప్పుగా అర్ధం అయ్యింది అంటూ సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.

రెక్సోనా సబ్బు యాడ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక్కో మేల్ హౌస్ మేట్.. ఒక్కో ఫిమేల్ హౌస్ మేట్ ని ఎంచుకుని ఆమెకి ప్రపోజ్ చేయాలి ఆ ప్రపోజల్ లో రెక్సోనా మృదువైన చర్మం అనే కాన్సెప్ట్ రావాలి ఇదీ టాస్క్. ఇక హిమజ, రాహుల్ మధ్య ఈ రొమాంటిక్ జంట టాస్క్ నడిచింది. అటు తరువాత మహేష్ విట్టా, పునర్నవికి ప్రపోజల్ చేశాడు. స్పాంటేనియస్ గా రెక్సోనా యాడ్ ని కలుపుతూ తను అల్లిన కథనం.. స్కిట్ చాలా బాగా వచ్చాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *