బిగ్ బాస్ కెప్టెన్ గా మహేష్ విట్టా…

బిగ్ బాస్-3 61వ ఎపిసోడ్ లో కాలేజ్ టాస్క్‌ లో బెస్ట్ టీజర్‌, బెస్ట్ స్టూడెంట్‌ను ఏకాభిప్రాయంతో చెప్పాలనగా.. స్టూడెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో బాబా భాస్కర్ ను బెస్ట్ టీచర్ ఎన్నుకున్నారు. టీచర్స్ ముగ్గురూ వితికా, వరుణ్ బాబా భాస్కర్‌ను బెస్ట్ స్టూడెంట్‌గా మహేష్‌ని ఎన్నుకున్నారు. బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ టీచర్‌లుగా ఎన్నికైన బాబా భాస్కర్, మహేష్‌ విట్టా ఇద్దర్నీ కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించారు బిగ్ బాస్.

కెప్టెన్ టాస్క్ లో భాగంగా.. ‘ప్రచారమే ఆయుధం’ అనే ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం మహేష్ విట్టా, బాబా భాస్కర్‌లు మిగిలిన ఇంటి సభ్యుల దగ్గరకు వెళ్లి తమని కెప్టెన్‌గా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. వీళ్ల ప్రచారం నచ్చతే తమ వద్ద ఉన్న దండను తీసి కంటెస్టెంట్స్ మెడలో వేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో పునర్నవి, హిమజలు.. బాబా భాస్కర్ మెడలో దండ వేయగా.. మహేష్ విట్టా మెడలో వరుణ్ సందేశ్, హిమజ, శివజ్యోతి, రాహుల్, రవి, శ్రీముఖిలు దండలు వేశారు. ఎనిమిది మందిలో ఎక్కువ ఓట్లు మహేష్ విట్టాకే రావడంతో గురువు బాబా భాస్కర్‌పై విజయకేతనం ఎగురవేసి బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు మహేష్ విట్టా.

చెప్పుకోండి చూద్దాం అనే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో హిమజ సంచాలకులుగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో కెప్టెన్‌ మహేష్ ప్లకార్డును పట్టుకుంటాడు కానీ దాన్ని చూడడు. ఇంటిసభ్యులు నేరుగా అక్కడ రాసి ఉన్న పేరును కెప్టెన్‌తో చెప్పించాలి. అందరూ సరిగ్గా చెప్పడంతో లగ్జరీబడ్జెట్‌ టాస్క్‌ విజయవంతంగా పూర్తయింది.

ఇంట్లో అడుగుపెట్టి 60 రోజులు పూర్తయినందున ఫ్యామిలీని మిస్‌ అవుతున్న ఇంటి సభ్యుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ సిద్ధం చేశాడు బిగ్ బాస్. వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను చూపించారు. దీనితో  ఇంటి సభ్యులందరూ ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీముఖి, శివజ్యోతిలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.  ఇక వచ్చిన కుటుంబ సభ్యులతో బిగ్‌బాస్‌ గేమ్‌ ఆడించనున్నాడు. అందులో భాగంగా అయిదింటిలో జోకర్‌, అయిదింటిలో ఐ లోగో ఉన్న బాక్సులను ఏర్పాటు చేశాడు. ఐ లోగో వచ్చిన వారితో గేమ్‌ ఆడించి అందులో గెలిచిన ఇద్దరికి మాత్రమే ఇంట్లోకి వెళ‍్లే అవకాశముందని చెప్పాడు. ఇప్పటికే వితిక లక్కీ చాన్స్‌ కొట్టేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *