రచ్చ చేసిన తమన్నా సింహాద్రి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎపిసోడ్ 11, ముందు రోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ తో ప్రారంభమైంది, కాగా.. ఈ రోజు తమన్నా సింహాద్రి, రవి కృష్ణ మరియు, అలీ రాజాలతో వాగ్వాదానికి దిగింది, ఇందుకు గల సరైన కారణం ఏంటో ఎపిసోడ్ లో చూపించకుండానే.. గొడవ పెట్టుకున్నట్టు చూపించటం ప్రేక్షకులకు కాస్త అర్ధంకానట్టుగా అనిపిస్తుంటుంది, తనను తాను హైప్ చేసుకోవటానికి కావాలనే.. గొడవలకు పోతూ.. చిన్న చిన్న అల్లరి పనులు చేస్తున్నట్టుగా తోస్తుంది తమన్నా.. శైలి. ఇకపోతే.. ముందురోజున బిగ్ బాస్ ఆపేసిన నిత్యవసరాలైన గ్యాస్ మరియు నీటి సరఫరాను, అలాగే ఇంటిలోకి వెళ్ళటానికి, రావటానికి కావల్సిన యాక్సెస్ ను ఫ్రీ యూజ్ చేయటం కోసం ఈరోజు మరో మూడు టాస్క్ లను ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్. గొప్పగా చెప్పుకునేంత పెద్ద టాస్క్ లేమీ కాకపోయినా.. గ్యాస్ వాడకాన్ని విడుదల చేయటానికి గానూ.. అలీ రజా,శ్రీముఖిలకు 100 పిడకలు చేయాలని, వితిక షెరూకి

వాటర్ రిలీజ్ చేయటం కోసం, చేపలు పెట్టిన టబ్ లో కాయిన్స్ వేసి, ఇన్ టైంలో 50 కాయిన్స్ తీయాలని టాస్క్ లు ఇవ్వగా సరైన సమయంలో వాటిని పూర్తి చేసి గ్యాస్ మరియు నీటి సరఫరాను పొందగలిగారు ఇంటి సభ్యులు, కాగా హౌజ్ యాక్సెస్ కోసం మహేష్ విట్టాకి మరో టాస్క్ అప్పగించారు బిగ్ బాస్, అదే.. గాలిలో దీపం, గార్డెన్ ఎరియాలో దీపం పెట్టి అది ఆరిపోకుండా చూసుకోవటమే… ఈ టాస్క్, అయితె దీనికి సంబంధించిన నిబంధనలేవీ.. ముందే చెప్పకపోవటంతో శివజ్యోతి సలహా మేరకు మహేష్ విట్టా తన చేతులను దీపానికి అడ్డం పెట్టి వర్షం పడుతుందని గొడుగు పట్టుకున్నాడు, ఇది కాస్తా గమనించిన బిగ్ బాస్ వెంటనే.. తను దీపానికి చేతులు కానీ.. ఎటువంటి వస్తువును కానీ.. అడ్డు పెట్టకుండా కేవలం నూనెను ఉపయోగించి దీపం ఆరిపోకుండా చూడాలని ఆదేశించటంతో బిగ్ బాస్ మాటలకు వితికతో సహా. పలువురు చప్పట్లు కొట్టారు, ఈ విషయమై శివజ్యోతి కోపానికి గురై తను ఒక సలహా ఇచ్చానని అది బిగ్ బాస్ వద్దన్నందుకు మీరంతా నన్న గేలి చేసినట్టు చప్పట్లు కొట్టటమేంటని ప్రశ్నించగా… వరుణ్ సందేశ్ మిగతా వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకొని శివజ్యోతితో వారించడంతో మాటా మాటా పెరిగి శివజ్యోతి కన్నీరు పెట్టుకుంది,ఇదే విషయమై హిమజ, జ్యోతికి వత్తాసు పలుకుతూ… బిగ్ బాస్ చెప్పగానే.. కొందరు చప్పట్లు కొట్టటంతో జ్యోతి గేలి చేసినట్టుగా భావించిందని అలా చేయటం తనకు కూడా నచ్చలేదని చెప్పుకొచ్చింది, మొత్తానికి మహేష్ విట్టా దీపాన్ని చక్కగా కాపాడటంతో హౌజ్ యాక్సెస్ ను కూడా రిలీజ్ చేసాడు బిగ్ బాస్, అయితే నిన్నటి నుండి టాస్క్ లో ఎవరైతే సరిగా చొరవ చూపలేదో ఆ ఇద్దరి పేర్లను ఏకగ్రీవంగా చెప్పమని ఇంటి సభ్యులకు ఆదేశించగా.. ఎవరు కూడా మరొకరిని నామినేట్ చేయలేదు, దానితో వరుణ్ సందేశ్ మరియూ.. తమన్నా సింహాద్రిలు వారికి వారై పేర్లను చెప్పుకున్నారు, దానితో బిగ్ బాస్ వారిద్దరికీ తన తదుపరి ఆదేశం వచ్చే వరకూ.. జైల్లోనే.. ఉండాలని శిక్ష విధించాడు, ఊహించని శిక్ష పడటం జైలు ఆవరణలో ఫ్యాన్ కానీ.. ఏసీ కానీ లేకపోవటంతో.. తనకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదని, అనవసరంగా నాకై నేను ముందుకు వచ్చి చిక్కుల్లో పడ్డానని ఏడ్చింది తమన్నా సింహాద్రి. ఇంతటితో పదకొండవ ఎపిసోడ్ పూర్తి చేసి, రేపటి ఎపిసోడ్ (12)లో ఇంటి సభ్యులు జంబలకిడిపంబ లాగా ఆడవారు మగ వేషాలతో, మగవారు ఆడవేషాలతో డాన్సులు, ఆటలు, పాటలు పాడుతున్నట్టుగా చూపించారు.

ఎపిసోడ్ 11 కి సంబంధించిన పూర్తి రియాక్షన్ వీడియో పైన ఉంది, చూసేయండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *