వరుణ్ సందేశ్, తమన్నాలకు గట్టిగా ఇచ్చుకున్న నాగార్జున

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎపిసోడ్ 14, శనివారం నాగార్జున ఎంట్రీతో మొదలై, శుక్రవారం ఇంట్లో ఏం జరిగిందో ప్రేక్షకులతో పాటు కలిసి మన టీవీలో చూద్దామంటూ సాగింది, కాగా.. ఎప్పటిలాగే.. నాగార్జున ఈ వారం జరిగిన గొడవలు, సభ్యుల మధ్య మనస్పర్ధలను పోగెట్టే పనిలో భాగంగా మహేష్ విట్టా విషయంలో వరుణ్ సందేశ్ కి, అలి రెజా విషయంలో తమన్నాకి ఒకింత గట్టిగానే.. మందలించాడని చెప్పొచ్చు, సీమ నుండి వచ్చిన వాళ్ళంతా మాస్ కాదు, సిటీ నుండి వచ్చిన వాళ్ళంత క్లాస్ కాదంటూ.. సందేశ్ ను, మనతో పాటు అవతలి వాళ్ల ఫీలింగ్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని మెదలాలని తమన్నాను మందలించాడు నాగార్జున. తర్వాత ఇంటి సభ్యులతో హీరో-విలన్ గేమ్ అంటూ.. బంగారు, నలుపు రంగుల్లో ఉన్న రెండు కిరీటాలను తెప్పించి,

హీరో అనుకునే వాళ్ళకు బంగారం రంగు కిరీటం విలన్ అనుకునే వాళ్ళకు నలుపు రంగు కిరీటం పెట్టాలని, ఆ కిరీటం వారికి ఇవ్వటానికి గల కారణమేంటో కూడా చెప్పాలని ఆదేశించాడు, కాగా.. శివజ్యోతి, ఆశురెడ్డి, రోహిణిలు హీరోగా బాబా భాస్కర్ కు బంగారు కిరీటాన్ని అలంకరించారు, విలన్ గా జ్యోతి – వరుణ్ సందేశ్ ను, ఆశు రెడ్డి – రాహుల్ సిప్లిగంజ్ ను, రోహిణి – తమన్నా సింహాద్రిలకు నలుపు కిరీటం పెట్టటం జరిగింది, ఈ ఆటలో ఎక్కువ శాతం విలన్ గా కిరీటాలు దక్కించుకుంది వరుణ్ సందేశ్ మరియూ.. తమన్నా సింహాద్రిలే.. పోగా బాబా భాస్కర్ కి హీరోగా ఎక్కువ కిరీటాలు వచ్చినందుకు, బిగ్ బాస్ కన్ను గుర్తు టాటూను చేతికి వేసుకొమ్మని బహుమానంగా ఇచ్చాడు నాగార్జున, అయితే.. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన ఎనిమిది మంది సభ్యులు (శ్రీముఖి, హిమజ, మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, వితిక, జాఫర్, పునర్నవి)లలో ప్రేక్షకుల ఓట్ల మేరకు తొలుత మహేష్ విట్టాను, తరువాత హిమజను, ఆ తదుపరి రాహుల్ సిప్లిగంజ్ ను, చివరిగా శ్రీముఖిని సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా ప్రకటించాడు నాగార్జున, కాగా మిగిలిన నలుగురు నామినేట్ అయిన సభ్యులు (పునర్నవి, జాఫర్, వితిక, వరుణ్ సందేశ్) లలో ఎవరు ఇంట్లో ఉండబోతున్నారు, ఎవరు వారి ఇంటికి వెళ్లబోతున్నారనే విషయం రేపు తెలుసుకుందామని చెప్పి ఎపిసోడ్ ముగిస్తుండటంతో.. బాబా భాస్కర్ లేచి, ఈరోజు తన కొడుకు అర్జున్ సతీష్ పుట్టినరోజని తనకు శుభాకాంక్షలు తెలుపమని కోరడంతో నాగార్జునతో పాటు ఇంటి సభ్యులందరూ కలిసి బాబా భాస్కర్ కుమారుడికి వారి శుభాకాంక్షలను తెలపటంతో ఈనాటి ఎపిసోడ్ ను ముగించారు

 

బిగ్ బాస్ ఎపిసోడ్ – 14 కి సంబంధించిన పూర్తి రియాక్షన్ వీడియో పైన ఇవ్వటం జరిగింది, చూసి ఆనందించండి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *