‘బిగ్‌బాస్’ డేట్ ఫిక్స్: 12 మంది సెలబ్రిటీలు, 60 కెమెరాలు, 70 రోజులు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న బుల్లితెర రియాల్టీ షో ‘బిగ్ బాస్’ ప్రారంభ తేదీ, షెడ్యూల్ ఖరారైంది. జులై 16 నుండి స్టార్ మాటీవీలో ఈ షో ప్రసారం కాబోతోంది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు, శని-ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. 12 మంది సెలబ్రిటీలు పాల్గొనే ఈ రియాల్టీ షో ప్రత్యేకంగా నిర్మించిన బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. అందరినీ అందులోకి పంపి లాక్ చేస్తారు. 70 రోజుల పాటు వారు అందులో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాల్సి ఉంటుంది. వారి కదలికలను 70 కెమెరాలతో పర్యవేక్షిస్తుంటారు.

దాదాపు 100 మంది ప్రముఖుల వడపోత అనంతరం 12 మందిని ఫైనల్ పోటీ దారులుగా ఎంపిక చేశారు. బిగ్ బాస్ తెలుగు వీక్షకులకు ఈ పన్నెండుమంది కావాల్సినంత వినోదం పంచుతారని షో నిర్వాహకులు అంటున్నారు.

ఇప్పటికే విడుదలైన బిగ్ బాస్ తెలుగు ప్రోమోలకు మంచి స్పందన వచ్చింది. 55 మిలియన్(5.5కోట్లు) వ్యూస్ సొంతం చేసుకుంది. నేషనల్ వైడ్ సోషల్ మీడియా ప్లాప్‌ఫాంలో ఈ వీడియోలు ట్రెడింగ్ అయ్యాయి. షో ప్రారంభం అయ్యాక కూడా రెస్పాన్స్ అదే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దాదాపు 10000 స్కేర్ ఫీట్స్ వైశాల్యంలో బిగ్ బాస్ హౌస్ నిర్మించారు. ఈ హౌస్ నిర్మాణంలో దాదాపు 750 మంది పని చేసినట్లు షో నిర్వాహకులు తెలిపారు. దీన్ని బట్టి ఈ షోపై ఎంతపెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

బిగ్ బాస్ హౌస్ లో ఏర్పాటు చేసిన 60 కెమెరాలతో అందులో ఉండే సెలబ్రిటీల ప్రతి కదలికను ప్రేక్షకులు పరిశీలించడానికి వీలుంటుంది. బిగ్ బాస్ షో మనకు కొత్త కాబట్టి ఈ షో ఎలా ఉంటుంది? ఏవిధంగా ఎంటర్టెన్ చేస్తుంది? అది జులై 16 తర్వాతగానీ మనకు అర్థమయ్యే పరిస్థితి లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *