బిల్ గేట్స్ కు బాగా నచ్చిన మన సినిమా

ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. మన సినిమాల్ని మనం చూడకుండా.. వాటికి ఈకలు పీకే రోజుల్లో.. మన సినిమాకు ఈ అపరకుబేరుడు ఫిదా అయిన వైనం తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ పేరుతో రిలీజ్ అయి పలువురి మనసుల్ని దోచిన మూవీ.. గేట్స్ మనసును దోచినట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

రియల్ వాస్తవాలకు రీల్ ట్రీట్ మెంట్ ఇస్తూ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. భూమి పెడ్నేకర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని గేట్స్ చేశారు. నీరజ్ పాండే తో కలిసి అక్షయ్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీనారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తనను ఆకట్టుకున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

రియల్ స్టోరీని రీల్ గా మలచిన ఈ మూవీపై గేట్స్ స్పందిస్తూ.. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలిపి ప్రజలు మేల్కొనేలా చేశారు. భారతదేశంలోని పారిశుద్ధ్య సవాళ్ల గురించి ఈ సినిమాతో ప్రేక్షకులకు తెలిసేలా చేశారని ఆయన పేర్కొన్నారు. గేట్స్ లాంటి వ్యక్తికి ఇండియన్ మూవీస్ నచ్చుతాయా? అన్న సందేహం తాజా ట్వీట్ తో సమాధానం దొరికేసినట్లే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *