సంపన్నులు, సంపాదన

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భారత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారని తెలిపారు.గత ఏడాది మన దేశంలో సగటున ప్రతి నెలలో ముగ్గురు డాలర్‌ బిలియనీర్లు ఆవిర్భవించారు. 34 మంది కొత్త బిలియనీర్లు జతకావడంతో దేశంలోని వారి సంఖ్య ఏడాదికాలంలో 138కి ఎగబాకింది. ఓ వైపు దేశంలో ఆర్థిక మందగమనం సాగుతున్నప్పటికీ వారి సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం.ప్రపంచవ్యాప్తంగా చూస్తే బిలియనీర్లలో భారత్‌ మూడోస్థానంలో నిలిచిందని హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ 2020 జాబితా వెల్లడించింది. వీరిలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.ఆయన ఆస్తుల నికర విలువ 6,700 కోట్ల డాలర్లు(సుమార రూ.4.8లక్షల కోట్లు). అంటే ఆయన గంటకు రూ. 7 కోట్లు సంపాదిస్తున్నట్టు లెక్క తేల్చారు . ప్రపంచ కుబేరుల్లో ముకేశ్‌ అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు.ప్రపంచ బిలియనీర్లలో 14,000 కోట్ల డాలర్లతో అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని సంపన్నుల్లో ఎస్‌పీ హిందుజా కుటుంబం (2,700 కోట్ల డాలర్లు) రెండో స్థానంలో, గౌతమ్‌ అదానీ (1,700 కోట్ల డాలర్లకు పైగా) మూడో స్థానంలో, శివ్‌ నాడార్‌ ఆయన కుటుంబం ( దాదాపు 1,700 కోట్ల డాలర్లు) నాలుగో స్థానంలో, లక్ష్మీ మిట్టల్‌ (1,500 కోట్ల డాలర్లు) ఐదో స్థానంలో నిలిచారు.ఓయో వ్యవస్థాపకుడు 24 ఏళ్ల వయసున్న రితేష్‌ అగర్వాల్‌ సంపద 110 కోట్ల డాలర్లుగా ఉంది. దేశంలో అతి పిన్న వయసు సంపన్నుడు ఈయనే కావడం విశేషం.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *