నమ్రతకు బర్త్‌డే విషెస్‌

  • నమ్రతా శిరోద్కర్.. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు  అర్ధాంగిగా అందరికీ సుపరిచితమే. మహేశ్‌బాబుకు అన్ని విషయాల్లో సూచనలు, సలహాలు అందిస్తూ నఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుందన్న విషయం తెలిసిందే. నేడు ఆమె 48 పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు తన భార్యకు బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. ‘ఎంతగానో ప్రేమించే నా ఇల్లాలికి, జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశాడు. ఇక మహేశ్‌ సోదరి మంజుల కూడా నమ్రతకు బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ‘నీ కలలు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్‌ యూ సో మచ్‌..’ అంటూ నమత్రతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మహేశ్‌ అభిమానులు సైతం ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2000లో వచ్చిన ‘వంశీ’ సినిమాలో మహేశ్, నమ్రతా జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2005 ఫిబ్రవరి లో పెళ్లి చేసుకున్నారు. . నేను నమ్రత పెళ్లి చేసుకుని 14 ఏళ్లు అవుతోంది. మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఇద్దరం మాకు నచ్చినట్లుగానే ఉంటాం. మా పెళ్లి ఇంత సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ప్రధాన కారణం అదేనని  మహేశ్‌బాబు తెలిపాడు.. వీరికి ఇద్దరు పిల్లలు. గౌతమ్, సితార. ప్రస్తుతానికైతే ఇద్దరూ చదువుకుంటున్నారు. గౌతమ్ మాత్రం చిన్న వయసులోనే తన తండ్రి నటించిన సినిమాలో నటించేశాడు. మహేశ్ నటించిన నేనొక్కడినే సినిమాలో గౌతమ్ మహేశ్ చిన్నప్పటి పాత్రలో నటించాడు. నమ్రతా శిరోద్కర్  1993 లో ఈమె మిస్ ఇండియాగా ఎంపికైంది కిరీటం దక్కించుకొంది. మొదట రూపదర్శిగా పనిచేసేది. తర్వాత సినీ నటనను వృత్తిగా స్వీకరించింది. నమ్రతా 1993 లో మిస్ ఆసియా పసిఫిక్ కోసం 1 వ రన్నర్ అప్ గా ఎంపికయ్యింది. ‘వంశీ’ అంజి, ట‌క్క‌రి దొంగ‌ ఆమె నటించిన సినిమాలు  2అవార్డులు కూడా వచ్చాయి.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *